సింధూ పెళ్లి చేసుకునే వ్యక్తి వెంకటసాయి దత్తాను ఆమె పెళ్లి చేసుకోబోతుందని ఆయన పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా పనిచేస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పీవీ సింధు పెళ్లి చేసుకోబోతుంది. ఈ డిసెంబర్ 22న ఉదయ్ పూర్ లో పెళ్లి కి రెడీ అవుతుంది. 24 హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సింధు తండ్రి అనౌన్స్ చేశారు. అయితే పీవీసింధూ భర్త గురించిన వివరాలు కోసం జనాలు తెగ సర్చ్ చేస్తున్నారు. సింధూ పెళ్లి చేసుకునే వ్యక్తి వెంకటసాయి దత్తాను ఆమె పెళ్లి చేసుకోబోతుందని ఆయన పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా పనిచేస్తున్నారు.
ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/లిబరల్ స్టడీస్‌లో డిప్లొమా చేశారు. 2018లో ఫ్లేమ్ యూనివర్శిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తన బీబీఏ అకౌంటింగ్, ఫైనాన్స్ పూర్తి చేశారు. బెంగుళూరుకు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి డేటా సైన్స్ , మెషిన్ లెర్నింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తోనూ అతడికి అనుబంధం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. జేఎస్‌డబ్ల్యూలో (జిందాల్ సౌత్ వెస్ట్) వెంటక దత్త సాయి తన కెరీర్‌ను మొదలు పెట్టారట. అక్కడ అతను సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. తన జాబ్స్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిసి పనిచేసినట్లు తెలిసింది.