ప్రీమియర్ షో లకు వచ్చిన అమౌంట్ ను థియేటర్ల యాజమాన్యం తీసుకుంటుందట. దీంతో ఏకీభవించని వారి వేసిందే పిటిషన్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన పుష్ప -2 అప్పుడే వివాదాల్లో చిక్కుకుంది. ఈ మంథ్ 5 వ తారీఖున రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది. అయితే ఈ సినిమా అర్థరాత్రి 1.50 గంటల నుంచి ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియం షో టికెట్ల ధరలు భారీగా పెంచారు. పెంచిన ధరలు కూడా నిర్మాతలకే చేరుతుందట. గతంలో ప్రీమియర్ షో లకు వచ్చిన అమౌంట్ ను థియేటర్ల యాజమాన్యం తీసుకుంటుందట. దీంతో ఏకీభవించని వారి వేసిందే పిటిషన్.
పుష్ప-2 టికెట్ల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పై కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీని పై రేపు హైకోర్టు లో విచారణ జరుగుతుంది. ప్రీమియర్ల కు టికెట్ ధరపై 800 వరకు పెంచిన ప్రభుత్వం అది నిర్మాతలకు చెందడం కాస్త ఆలోచించాల్సిన విషయంగా పేర్కొంది. డిసెంబర్ 05 నుంచి 08 వరకు ఈ టికెట్ రేట్లు పెంచాయి. ఆ తర్వాత కూడా టికెట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.