Avinash: ఆ యాంకర్ దగ్గర 5 లక్షలు అప్పు చేసిన అవినాష్.. కారణం.?

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అవినాష్ అంటే అందరికీ తెలుసు.ఈయన మొదట్లో పటాస్ కామెడీ షో లో కమెడియన్ గా చేశారు.అయితే అలాంటి అవినాష్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా కూడా ఎంతో గుర్తింపు సంపాదించారు.అలాంటి అవినాష్ ఓ లేడీ యాంకర్ దగ్గర ఐదు లక్షల అప్పు చేశారట. మల్లెమాలవారు నిర్వహిస్తున్న జబర్దస్త్ షోలో కొన్ని  నిబంధనలు ఉంటాయి.. ఇక వీళ్ళు చేసుకున్న బాండింగ్ వరకు ఆ షోలోనే కొనసాగాలి.ఒకవేళ అందులో నుండి తప్పుకుంటే డబ్బులు కట్టాల్సిందే.అయితే ఈ కామెడీ షో లో అవినాష్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయనకు బిగ్ బాస్ రియాల్టీ షోలో అవకాశం రావడంతో ఆ షో కి వెళ్లడం కోసం జబర్దస్త్ నుండి తప్పుకున్నారు.  జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో పది లక్షల ఫైన్ కట్టాలని చెప్పారట. దాంతో చేసేదేమీ లేక అవినాష్ ఒక ఐదు లక్షలు యాంకర్ శ్రీముఖి దగ్గర అప్పు తీసుకున్నారట.మరో ఐదు లక్షలు మరో వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని అలా 10 లక్షలు జబర్దస్త్ వారికి కట్టారట.


Published Jun 26, 2024 04:14:13 PM
postImages/2024-06-26/1719398653_avinash.jpg

న్యూస్ లైన్ డెస్క్: జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అవినాష్ అంటే అందరికీ తెలుసు.ఈయన మొదట్లో పటాస్ కామెడీ షో లో కమెడియన్ గా చేశారు.అలా ఈయనకు ముక్కు అవినాష్ అనే పేరు కూడా ఉంది. అయితే అలాంటి అవినాష్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా కూడా ఎంతో గుర్తింపు సంపాదించారు.ఇక చేతి నిండా బుల్లితెర షోలతోపాటు చాలా సినిమాల్లో కమెడియన్ గా కూడా చేస్తున్నారు.అయితే అలాంటి అవినాష్ ఓ లేడీ యాంకర్ దగ్గర ఐదు లక్షల అప్పు చేశారట. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరు ఐదు లక్షలు అప్పు చేయాల్సిన అవసరం అవినాష్ కు ఏం వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం..

మల్లెమాలవారు నిర్వహిస్తున్న జబర్దస్త్ షోలో కొన్ని  నిబంధనలు ఉంటాయి. ఈ షోలో జాయిన్ అయ్యే సమయంలోనే బాండింగ్ అనేది చేసుకుంటారు. ఇక వీళ్ళు చేసుకున్న బాండింగ్ వరకు ఆ షోలోనే కొనసాగాలి. ఒకవేళ అందులో నుండి తప్పుకుంటే డబ్బులు కట్టాల్సిందే.అయితే ఈ కామెడీ షో లో అవినాష్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయనకు బిగ్ బాస్ రియాల్టీ షోలో అవకాశం రావడంతో ఆ షో కి వెళ్లడం కోసం జబర్దస్త్ నుండి తప్పుకున్నారు.

అయితే జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో పది లక్షల ఫైన్ కట్టాలని చెప్పారట. దాంతో చేసేదేమీ లేక అవినాష్ ఒక ఐదు లక్షలు యాంకర్ శ్రీముఖి దగ్గర అప్పు తీసుకున్నారట.మరో ఐదు లక్షలు మరో వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని అలా 10 లక్షలు జబర్దస్త్ వారికి కట్టారట.ఇక ఈ విషయాన్ని రీసెంట్ గా అవినాష్ చెప్పారు. అలాగే బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని,ఈ షో ద్వారా ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యానని కూడా అవినాష్ చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu avinash jabardasth big-boss srimukhi

Related Articles