ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడస్టార్ ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్నారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామ్ పోతినేని మళ్లీ తన పాత రూట్ లోనే వెళ్లి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.. చాక్లెట్ బాయ్ గా రాబోతున్నాడు. రామ్ 22 వ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడస్టార్ ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్నారు. ఈయన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ఉపేంద్ర ఒక హీరోగా, రామ్ ఆ హీరో అభిమానిగా కనిపించబోతున్నాడట. ఈ రోజు సినిమా టైటిట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ప్రకటించారు. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అయితే ఈ గ్లింప్స్ లో రామ్ థియేటర్ కి వచ్చి టికెట్లు అడిగి ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్తాడు. థియేటర్ దగ్గర సందడి , స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే టికెట్ల కోసం అడింగించడం లాంటివి ఈ గ్లింప్స్ లో చూపించారు.
ఈ టైటిల్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ..పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పేరు చాలా వైరల్ అయ్యింది, దాన్ని ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది తాలూకా అని రాసుకుంటున్నారు. ఇప్పుడు రామ్ సినిమాకు కూడా పిఠాపురం తాలూకా ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఆంద్ర కింగ్ తాలూకా అని టైటిల్ తీసుకున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది.