పార్కింగ్ డబ్బులు గోవిందా .. పాప్ కార్న్ ట్యాక్సులు గోవిందా అంటూ స్వామివారి నామాలు కామెడీగా ర్యాంప్ సాంగ్ గా మార్చారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తమిళ్ స్టార్ కమెడియన్ సంతాపం అప్పుడప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తూ ఉంటాయి. సంతానం హీరోగా చేసిన డీడీనెక్స్ట్ లెవల్ సినిమా మే 16 న రిలీజ్ కానుంది. ఇటీవల రెండు నెలల క్రితం ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. శ్రీనివాస గోవిందా అనే గోవింద నామాలతో పేరడీ సాంగ్ ని తయారుచేశరాు. పార్కింగ్ డబ్బులు గోవిందా .. పాప్ కార్న్ ట్యాక్సులు గోవిందా అంటూ స్వామివారి నామాలు కామెడీగా ర్యాంప్ సాంగ్ గా మార్చారు.
ఈ పాట వైరల్ అవ్వడంతో హిందూ భక్తులు మూవీ యూనిట్ పై మండిపడుతున్నారు. స్వామి వారి నామాలతో ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు. తమిళనాడులో చాలా చోట్ల సంతానంపై , మూవీ యూనిట్ పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. జాగా ఈ వివాదంపై సినిమా ప్రమోషన్స్ లో సంతానం స్పందించాడు. సంతానం మాట్లాడుతూ మేము శ్రీవారిని అవమానించలేదు. సెన్సార్ బోర్డు నిబంధనల మేరకే సినిమా తీసాం. రోడ్డు మీద పోయే వాళ్లు ఏదో ఒకటి మాట్లాడతారు. వాటి్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు సంతానం . ఈ వ్యాఖ్యలపై మరింత మండిపడుతున్నారు భక్తులు.
తమిళనాడుకు చెందిన ప్రజా ప్రతినిధులు ఆ పాటను చిత్రం నుండి తొలగించేలా చేయాలి. లేదా చిత్రాన్ని బ్యాన్ చేసేలా పోరాటాలు చేయాలి. స్టాలిన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటివి చేస్తున్నారని అన్నారు.తమిళనాడు ప్రజాప్రతినిధులకు టీటీడీ దర్శనాలు కల్పించవద్దు. వారికి నిజంగా భక్తి ఉంటే చిత్రాన్ని బ్యాన్ చేసిన తర్వాత దర్శనాలు కల్పించండి అని అన్నారు.