గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది.నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత బాలీవుడ్ యాక్టర్ అలియాభట్ తన సోషల్ మీడియా అకౌంట్ లో సైనికుల కోసం ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. భారత సైనికుల ప్రతి జవాన్ యూనిఫామ్ వెనుక ఓ నిద్రపోని తల్లి ఉంటుందని అలియా పెట్టిన ఈ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది.నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది. ప్రతి భోజనం టేబుల్ చుట్టూ నిశ్మబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని ,దేశ కోసం మన కోసం యుధ్దం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్‌లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు . ఎంతో మంది త్యాగం కూడా దాగి ఉందంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది అలియా భట్.