నేడు జరిగే అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ వంటి విషయంలో అటు నిరుద్యోగులు.. ఇటు విద్యార్థి సంఘాల నాయకుల నుండి రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే.
నేడు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేడు జరిగే సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ అభివృద్ధి, ధరణిపై కొంతసేపు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు జాబ్ క్యాలెండర్..?
నేడు జరిగే అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ వంటి విషయంలో అటు నిరుద్యోగులు.. ఇటు విద్యార్థి సంఘాల నాయకుల నుండి రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్.. వ్యతిరేకతపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇటలీలో భూకంపం
ఇటలీలో భూకంపం సంభవించింది. కాలబ్రియా ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీరు విడుదల
నేడు నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీరు విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ నుంచి నీరు విడుదల కానుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నీటిని విడుదల చేయనున్నారు.