గత పది రోజుల కిందట రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి. దీంతో చాలామంది ఎండలోకి నీరు చేరి తీవ్రంగా నష్టాన్ని కలిగించాయి. ఎన్నో ఇండ్లు నీట మునిగి
న్యూస్ లైన్ డెస్క్:గత పది రోజుల కిందట రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి. దీంతో చాలామంది ఎండలోకి నీరు చేరి తీవ్రంగా నష్టాన్ని కలిగించాయి. ఎన్నో ఇండ్లు నీట మునిగి కూలిపోయాయి. లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రి మొత్తం పాడైపోయింది. ఇవే కాకుండా చాలామంది ఇండ్లలో చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు పూర్తిగా తడిసిపోయి పాడైపోయాయి. మరి టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అలా పాడైపోతే పరిస్థితి ఎలా అని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ అలాంటి వారికి ఒక సదవకాశం కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ సర్టిఫికెట్లు పోయినవారు డూప్లికేట్ పత్రాలు పొందవచ్చట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ యొక్క పదవ తరగతి సర్టిఫికెట్ పోయినట్లయితే మీరు ఏ పాఠశాలలో చదువుకున్నారో అక్కడికి వెళ్లి అక్కడి ప్రిన్సిపాల్ తో డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం లేఖ రాయాల్సి ఉంటుంది. మీరు ఏ సంవత్సరంలో ఎగ్జామ్ రాశారు, నీ పేరు, తండ్రి పేరు వివరాలన్నీ నమోదు చేయాలి. ఒకవేళ మీ పాత సర్టిఫికెట్ జిరాక్స్ ఉంటే దానికి జత చేయాలి. ఆ తర్వాత ఈ లేఖను డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు పంపిస్తారు. అక్కడి నుంచి డీఈవో , అలా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కి దరఖాస్తు చేరుకుంటుంది. అక్కడ అన్ని పరిశీలించిన తర్వాత డూప్లికేట్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. ఇక ఇదే ప్రాసెస్ ద్వారా మళ్ళీ మీరు ఎక్కడైతే దరఖాస్తు పత్రాన్ని అందించారు అదే స్కూలుకు మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికెట్ పంపిస్తారు. ఒకవేళ పోగొట్టుకున్న అభ్యర్థికి పాత సర్టిఫికెట్ జిరాక్స్ లేనట్లయితే పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తప్పనిసరిగా పెట్టాలి.
ఇంటర్ సర్టిఫికెట్ పోయినట్లయితే మీరు ఆన్లైన్ లో bieap. apcfss.in అనే వెబ్సైట్ నుండి డూప్లికేట్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ సర్వీస్ అనే ఆప్షన్ ఎంచుకొని, ఆ తర్వాత డూప్లికేట్ లేదా ట్రిప్లికేట్ పాస్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మరో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ వివరాలన్నీ నమోదు చేయాలి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వారిని చదువుకున్న కాలేజీకి డూప్లికేట్ సర్టిఫికెట్ వస్తుంది. దీనికంటే ముందు పోలీస్ స్టేషన్ లో సర్టిఫికెట్ పోయిందని ఫిర్యాదు చేసి ఆ తర్వాత మీసేవ కేంద్రంలో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలట.
అలా కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ కు లేఖ రాయాలట. ఆ విధంగా టెన్త్ సర్టిఫికెట్ అయితే ఎలా వివిధ స్థాయి హోదాలను దాటి వెళ్లిందో ఆ విధంగానే ఇంటర్ బోర్డుకి కూడా ఇది వెళ్తుంది. అక్కడ పరిశీలనంతా పూర్తయిన తర్వాత మార్కు లిస్టుతో డూప్లికేట్ సర్టిఫికెట్ మళ్ళీ మీరు చదువుకున్న కాలేజీకి చేరుతుంది. ఇదే విధంగా డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను కూడా ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అప్లై చేసుకుని సదర్ యూనివర్సిటీల నుంచి మళ్లీ మీరు డూప్లికేట్ సర్టిఫికెట్లను పొందవచ్చు.