కేవలం రూ:9,999కే అద్భుత ఫీచర్స్ కలిగిన ఫోన్.!

సాంసంగ్ ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్ రంగాన్ని  ఊపు ఊపుతోంది. అలాంటి సాంసంగ్ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు రిలీజ్ అయి కస్టమర్ల ఆదరణ పొందాయి. అలాంటి కంపెనీ


Published Sep 04, 2024 08:38:02 AM
postImages/2024-09-04/1725456270_galaxy.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాంసంగ్ ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్ రంగాన్ని  ఊపు ఊపుతోంది. అలాంటి సాంసంగ్ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు రిలీజ్ అయి కస్టమర్ల ఆదరణ పొందాయి. అలాంటి కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ ఏ06 భారతదేశంలో విడుదలైంది. అయితే ఈ మొబైల్ ఇంతకుముందే ఆసియా మార్కెట్ లో లాంచ్ చేశారు. అలాంటి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే ఈ ఫోన్ లో ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జి85 చిప్ సెట్, అలాగే ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే,50mp ప్రైమరీ కెమెరా కలిగి ఉంది.  అంతేకాకుండా ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ కలిగి ఉండి 25w వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే గెలాక్సీ A06 అద్భుతమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది.

ఈ మొబైల్ 4జీబీ, 64 జిబి స్టోరేజ్  ధర రూ:9,999కలిగి ఉంది. స్టోరేజ్ వేరియంట్ ధర రూ:11,499కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ సాంసంగ్ ఇండియా వెబ్ సైట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ బ్లాక్,  వైట్ బ్లూ, గోల్డ్ కలర్స్ లో మనకు అందుబాటులోకి వస్తోంది. అలాగే ఈ మొబైల్  720×1600 పిక్సల్స్ కలిగి ఉండి  4జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.  అంతేకాకుండా మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు మనం పెంచుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది.

One Ui 6లో రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్  కూడా ఉంచారు. అంతేకాకుండా ఫోన్ వైఫై, బ్లూటూత్ 5.3 జిపిఎస్, 3.5mm ఆడియో జాక్, అంతేకాకుండా 167.3 mm పొడవు కలిగి ఉండి, 77.3mm వెడల్పు, 189గ్రా" బరువు కలిగి ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : news-line 5500-battery super-camera mobile super-features

Related Articles