Abhishek: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న  నటుడు.?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఏమో కానీ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో సంచలనాలు బయటపడుతున్నాయి.ఓవైపు ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉంటే 


Published Sep 26, 2024 08:17:06 PM
postImages/2024-09-26/1727362026_abhishekdrugs.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఏమో కానీ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో సంచలనాలు బయటపడుతున్నాయి.ఓవైపు ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉంటే మరోవైపు డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తోంది. గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ ఇప్పుడు తెర పైన వినిపిస్తుంది.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతూ కొంటూ వస్తున్నారు. అయితే తాజాగా సినీ నటుడు అభిషేక్ డ్రగ్స్ కేసులో పట్టుపడ్డారు. అయితే ఈయన 12ఏళ్ల కిందటే డ్రగ్స్ కేసులో దొరికారు.

ఆయన కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయగా ఆయన కారులో కొకైన్ ప్యాకెట్స్ బయటపడడంతో ఈయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన అభిషేక్ కోర్టుకు హాజరుకాకుండా రాష్ట్రం వదిలి పరారయ్యారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత అభిషేక్ సమాచారం పోలీసులు తెలుసుకున్నారు. గోవాలో ఆయన ఓ రెస్టారెంట్ నడిపిస్తున్నారు అనే విషయం తెలుసుకున్న యాంటీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్పెషల్ బృందం గోవా కి వెళ్లి మరి పక్క సమాచారంతో అభిషేక్ ని అరెస్టు చేశారు.

అలా దాదాపు 12 ఏళ్ల తర్వాత అభిషేక్ మళ్లీ పోలీసులకు చిక్కారు. ఇక అభిషేక్ కొన్ని సినిమాల్లో కరెక్ట్ ఆర్టిస్టుగా చేశారు.అలా తెలుగులో సిద్ధార్థ్,త్రిష కాంబినేషన్లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిషను పెళ్లి చేసుకోవాలనుకునే నెగటివ్ పాత్రలో నటించారు. అలాగే అల్లరి నరేష్ తో డేంజర్, నేను వంటి సినిమాల్లో కూడా చేశారు

newsline-whatsapp-channel
Tags : news-line abhishek drugs-case nuvvastanante-nenoddantana-movie nenu-movie danger-movie

Related Articles