Keneeshaa: ఆర్తి పేరెంట్స్ తో కలిసి జయం రవి పై దాడి.?

జయం రవి విడాకుల విషయంలో రోజుకొక కొత్త రూమర్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రూమర్లన్నింటికీ తెరపడేలా సింగర్ కి కెనీషా చేసిన కామెంట్లు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.అంతేకాదు


Published Sep 26, 2024 03:34:00 PM
postImages/2024-09-26/1727342917_keneeshaa.jpg

న్యూస్ లైన్ డెస్క్: జయం రవి విడాకుల విషయంలో రోజుకొక కొత్త రూమర్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రూమర్లన్నింటికీ తెరపడేలా సింగర్ కి కెనీషా చేసిన కామెంట్లు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.అంతేకాదు నేను ప్రూఫ్స్ అన్ని కోర్టు లో చూపిస్తాను అంటూ కెనీషా మాట్లాడంతో చాలామంది కోలీవుడ్ జనాలు జయం రవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.మరి ఇంతకీ సింగర్ కెనీషా బయటపెట్టిన ఆధారాలు ఏంటి.. సడన్గా జయం రవికి జనాలు సపోర్ట్ చేయడం వెనుక ఉన్న మతలబ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

జయం రవి విడాకులకు సింగర్ కెనీషానే కారణమని, ఆమెతో గోవాలో సహజీవనం చేస్తూ భార్యను దూరం పెట్టి చివరికి విడాకులు ఇచ్చేసారు అంటూ వార్తలు వినిపించాయి.అయితే తన వల్ల విడాకులు వచ్చాయి అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది కెనీషా ఆమె మాట్లాడుతూ.. జయం రవి ఎంతో డిప్రెషన్ లో ఉన్న సమయంలో నా దగ్గరికి వచ్చారు. నేను ఓ మానసిక నిపుణురాలిని.

ఆయన చెప్పిన మాటలు వింటే నాకే బాధేసింది.. ఎవరినైనా సరే అంత టార్చర్ చేసే రైట్ ఎవరికీ లేదు.అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా.. ఆయన్ని నేను డిప్రెషన్ నుండి తీసుకురావడానికి ఎంతో ట్రై చేశాను. ఆయనకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చాను అనేది కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కోర్టులో సబ్మిట్ చేయగలను. ఈ సాక్షాలన్నీ బయట పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి..

జయం రవిని ఆయన భార్య ఆర్తి తన తల్లిదండ్రులతో కలిసి హింసించింది. అందుకే ఆయన డిప్రెషన్లోకి వెళ్లారు.. అలాగే మా ఇద్దరి మధ్య ఒక వృత్తిపరమైన రిలేషన్ ఉంది.కానీ మా మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది కెనీషా.సింగర్ కెనీషా మాటలతో చాలామంది జనాలు జయం రవికి మద్దతు తెలుపుతున్నారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jayam-ravi jayam-ravi-divorce singer-keneeshaa aarti

Related Articles