తగ్గేదేలే అన్న మహిళా మణులు..పేకాట ఆడుతూ.?

ఇప్పటివరకు మనం పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన ఘటనలు ఎన్నో చూసాం. కానీ పేకాట రాణిలను అరెస్టు చేసిన  ఘటన ఇప్పుడే చూస్తున్నాం. అవును మీరు విన్నది నిజమే..  పేకాట ఆడుతున్నటువంటి


Published Sep 26, 2024 11:11:51 AM
postImages/2024-09-26/1727329311_poker.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇప్పటివరకు మనం పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన ఘటనలు ఎన్నో చూసాం. కానీ పేకాట రాణిలను అరెస్టు చేసిన  ఘటన ఇప్పుడే చూస్తున్నాం. అవును మీరు విన్నది నిజమే..  పేకాట ఆడుతున్నటువంటి మహిళా మణులు పోలీసులకు పట్టుబడ్డ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..  నిజామాబాద్ నగరంలోని సరస్వతీ నగర్ లో ఒక ప్రైవేట్ దవాఖాన నాలుగవ అంతస్తులో కొంతమంది మహిళా మణులు పేకాట ఆడుతున్నారని సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని అరెస్టు చేశారు.

 అయితే ఈ అరెస్టు అయిన వారంతా ప్రముఖ డాక్టర్ల సతీమణులని తెలుస్తోంది. మొత్తం వారి దగ్గర నుంచి 5 సెల్ ఫోన్లు, రూ:15100 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నేటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆడవాళ్లు మగవాళ్ళతో సమానం అంటారు పేకాట ఆడితే తప్పేంటి, ఆడవాళ్లు  అన్ని రంగాల్లో రాణించాలి అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line police doctors girls pekata nijamabad

Related Articles