ఆఫ్రికా తెగల్లో కలవనున్న మహేష్ బాబు. కారణమిదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈయన ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో నటించలేదు. అయినా మహేష్ బాబుకు మాత్రం విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది.  కేవలం సినిమాలు, తన కుటుంబం


Published Sep 26, 2024 08:16:00 AM
postImages/2024-09-26/1727317635_mahesh1.jpg

న్యూస్ లైన్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈయన ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో నటించలేదు. అయినా మహేష్ బాబుకు మాత్రం విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది.  కేవలం సినిమాలు, తన కుటుంబం తప్ప మరో విషయంలో వేలు పెట్టని మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న కంట్లో పడ్డాడు.  ఈయనతో భారీ చిత్రాన్ని జక్కన్న ప్లాన్ చేశారట. ఇప్పటికే మహేష్ బాబు దానికోసం సన్నద్ధమవుతున్నారు. ఈ మధ్యకాలంలో  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కు ఇచ్చే సమయంలో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది.

దాన్ని బట్టి చూస్తే  రాజమౌళి మహేష్ బాబుని ఇప్పటివరకు జనాలు చూడని లుక్ లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాంటి మహేష్ బాబు ఈ సినిమా కోసం కొన్ని రోజులపాటు జపాన్ లో బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నారట. అయితే ఈయన త్వరలోనే ఆఫ్రికన్  తెగలో కలిసిపోనున్నారని తెలుస్తోంది. అయితే రాజమౌళి మహేష్ బాబు తో తెరకెక్కించే సినిమా యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ తో రూపొందుతుందట.  ఇది మొత్తం ఆఫ్రికన్ అడవుల్లోనే షూటింగ్ జరుపుకోబోతోందని కొన్ని లీకులు బయటకు వచ్చాయి.

కాబట్టి మహేష్ బాబు కూడా ఆఫ్రికాలోని  పిగ్మీలు, మసాయి తెగల మధ్య 20 రోజులపాటు కఠినమైనటువంటి బేసిక్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారట.  దీనికోసం ఆయన  ఆఫ్రికా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే మహేష్ బాబు కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాయట. ఇక మహేష్ బాబు అక్కడికి వెళ్లి ఆ తెగతో   మింగిల్ అయిపోయి వారి యొక్క హవ భావాలు, భాషా తీరు  అన్ని నేర్చుకోవాలట. పిగ్మీలు అంటే కాంగో నది పరివాహక ప్రాంతంలో ఉంటారు.

అంతేకాకుండా తూర్పు ఆఫ్రికాలో మాసాయి తెగ కూడా ఉంటుంది. ఇలా ఈ రెండు తెగల గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి రాజమౌళి  మహేష్ బాబును అక్కడికి పంపుతున్నారట. సాధారణంగా రాజమౌళితో సినిమా అంటే తప్పక ఆ హీరో నటించడం కాదు అందులో జీవించేలా చేస్తారు. కాబట్టి ఆయన ఎలాంటి కథ తీయబోతున్నారు అనేది హీరోకు చెప్పిన తర్వాత ఆ హీరో ఆ కథకు తగ్గట్టుగా ముందుగానే ప్రిపేర్ కావాలి. దానికోసమే మహేష్ బాబును కూడా అడవిలోకి పంపుతున్నట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news ss-rajamouli maheshbabu, pigmilu masai

Related Articles