Devara: ఈ 5అంశాలే హైలెట్.. ఏంటో తెలిస్తే థియేటర్ కు పరుగెత్తాల్సిందే.?

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ,  నా అనుకున్న వాళ్లు దూరం కొడితే, చివరికి ఎక్కడైతే దెబ్బతిన్నాడో  మళ్లీ అక్కడే ఎగసిపడే కెరటంలా ఎదిగాడు. ఒకప్పుడు మా నందమూరి ఫ్యామిలీ కాదని చెప్పిన వారే, 


Published Sep 26, 2024 01:20:46 PM
postImages/2024-09-26/1727337046_5.jpg

న్యూస్ లైన్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ,  నా అనుకున్న వాళ్లు దూరం కొడితే, చివరికి ఎక్కడైతే దెబ్బతిన్నాడో  మళ్లీ అక్కడే ఎగసిపడే కెరటంలా ఎదిగాడు. ఒకప్పుడు మా నందమూరి ఫ్యామిలీ కాదని చెప్పిన వారే, మన నందమూరి తాతకు తగ్గ మనవడు మా ఎన్టీఆర్ అని చెబుతున్నారు.  ఈ విధంగా ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన ఎన్టీఆర్ ఇప్పటివరకు సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా చేయలేదు. కానీ దేవర చిత్రం ద్వారా  పాన్ ఇండియా హీరోగా  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అలాంటి ఈ తరుణంలో సినిమా రిలీజ్ కి ముందే సినిమాలో కొన్ని హైలెట్ పాయింట్స్ బయటకు వచ్చాయి. ఆ పాయింట్స్ చూస్తుంటే మాత్రం తప్పక థియేటర్ కు పరుగెత్తాలి అనిపిస్తోంది. మరి దేవర సినిమాకి హైలైట్ గా నిలిచే పాయింట్స్ ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఎన్టీఆర్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఒకటి ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి..  ఇక ఈ మూడు చిత్రాల తర్వాత వస్తున్న నాలుగవచిత్రం దేవర. ఈ సినిమాలో కూడా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారట.

ఒక పాత్రలో వర  మరో పాత్రలో దేవర. ఈ విధంగా ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి మరో హైలెట్ అయ్యే అంశం హీరోయిన్ జాన్వీకపూర్..తెలుగు ఇండస్ట్రీలో ఈమె తల్లి శ్రీదేవి తన తాత ఎన్టీఆర్ తో నటించి హైలైట్ అయింది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తూ హైలెట్ అవ్వాలని చూస్తోంది.  ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నయని చెప్పవచ్చు. ఇక ఇందులో జాన్వీకపూర్ నటన అంద చందాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి.

ఈ విధంగా జాన్వీకపూర్ హీరోయిన్ గా ఉండడం ఈ సినిమాకి మరో హైలెట్. దేవర సినిమాకు సంబంధించి కథ 9 గంటలు ఉంటుందట.. అయితే ఈ సినిమా మొదటి పార్ట్  హిట్ అయితే, దేవర 2 పేరుతో మరో పార్ట్ గా సినిమాను తెరకెక్కిస్తారట. ఈ విధంగా ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తీసుకురాబోతున్నారని ముందే హింట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా యాక్షన్ డ్రామాగా 1980-90 నేపథ్యంలో సాగుతుందట.   అంతేకాకుండా క్లైమాక్స్ కూడా అదరగొట్టేస్తుందని  అంటున్నారు. ఈ విధమైనటువంటి పాయింట్స్ చూస్తే మాత్రం సినిమా తప్పక చూడాలనిపిస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr devara janhvi-kapoor koratala-shiva devara-movie-first-review

Related Articles