Prakash Raj: ప్రకాష్ రాజ్ కి షాక్..టాలీవుడ్ నుండి బ్యాన్.?

ఏంటి ప్రకాష్ రాజ్ ని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేయబోతుందా? ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి..ఆయన మీద ఎక్కడ కంప్లైంట్ వచ్చింది అని ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు షాక్ అవుతారు  అయితే ప్రకాష్ రాజ్ తప్పు ఎక్కడ


Published Sep 26, 2024 05:22:31 AM
postImages/2024-09-26/1727346103_prakashrajbanintollywood.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి ప్రకాష్ రాజ్ ని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేయబోతుందా? ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి..ఆయన మీద ఎక్కడ కంప్లైంట్ వచ్చింది అని ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు షాక్ అవుతారు  అయితే ప్రకాష్ రాజ్ తప్పు ఎక్కడచేశారు.. ఆయన్ని బ్యాన్ చేయమని ఎవరు డిమాండ్ చేస్తున్నారు అనేది చూస్తే.. గత రెండు మూడు రోజుల నుండి ప్రకాష్ రాజ్ ఎక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎన్నో వివాదాస్పద ట్వీట్లు పెడుతున్నారు.. ఇక ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూనే ఎంతోమంది హిందువులు ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై తాజాగా బీజేవైఎం కార్యకర్తలు అందరూ కలిసి ర్యాలీగా ఫిలింనగర్ కి వెళ్లి అక్కడ "మా" అసోసియేషన్లో ప్రకాష్ రాజ్ మీద ఫిర్యాదు చేశారు.

ఆయన హిందువుల మనోభావాలను కించపరిస్తూ మాట్లాడుతున్నారు. ఆయన పెట్టే ట్వీట్లు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి ప్రకాష్ రాజ్ పై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ "మా" అసోసియేషన్ లో బీజేవైఎం కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ వివాదంలో ఇరుక్కుపోయారు.అంతేకాదు ఆయనకు సంబంధించిన దిష్టిబొమ్మ కూడా దహనం చేశారు.

అయితే ఇప్పటికే చాలాసార్లు ఇండస్ట్రీ నుండి బ్యాన్ అయిన ప్రకాష్ రాజ్ మళ్ళీ ఇండస్ట్రీ నుండి బ్యాన్ అవుతారా ఏంటి అని కొంతమంది నెటిజెన్స్ భావిస్తున్నారు.ఇక మా అసోసియేషన్లో ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేయడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మరి చూడాలి మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో

newsline-whatsapp-channel
Tags : news-line pawan-kalyan manchu-vishnu maa-association prakash-raj bjym

Related Articles