గత నెల సెలవులపై ఇంటికి వెళ్లిన బాలిక.. పాఠశాలకు వెళ్లనంటూ ఇంటి వద్దనే ఇండిపోయిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారిని విచారించగా జరిగిన ఉదంతం బయటకు వచ్చిందని వాపోయారు. పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్టు బాలిక చెప్పిందని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలోని గురుకులాల్లో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనిరుధ్ పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. గడిచిన ఏడూ నెలల్లోనే 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయా రు. దాదాపు 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కి గురయ్యారు. ఓవైపు ఈ దుమారం కొనసాగుతుండగానే మరోవైపు పాముల వంటి విషజంతువులు మాత్రమే కాకుండా మనుషుల నుంచి కూడా విద్యార్థులకు రక్షణ కరువైందా అనేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి.
మైనర్‌పై లైంగిక వేధింపులు వేధింపులు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు తెలుస్తోంది. గత నెల సెలవులపై ఇంటికి వెళ్లిన బాలిక.. పాఠశాలకు వెళ్లనంటూ ఇంటి వద్దనే ఇండిపోయిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారిని విచారించగా జరిగిన ఉదంతం బయటకు వచ్చిందని వాపోయారు. పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్టు బాలిక చెప్పిందని తెలిపారు.
దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పాలకుర్తి పాఠశాలకు వెల్లి ప్రశ్నించారు. తమ కుమార్తె పట్ల వేధింపులకు పాల్పడిన క్యాటరింగ్ వర్కర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.