హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా పెంచిన పీజీ,PhD ట్యూషన్, పరీక్ష ఫీజులను తగ్గించాలని ABVP సంఘం నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ABVP ఓయూ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద మంగళవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించాలని ABVP సంఘం నాయకులు డిమాండ్ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం చేపట్టాలని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా పెంచిన పీజీ,PhD ట్యూషన్, పరీక్ష ఫీజులను తగ్గించాలని ABVP సంఘం నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే, నిరాహార దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ABVP సభ్యులు వెనక్కి తగ్గలేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవద్దని అన్నారు.
అయితే, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. ABVP సభ్యులు, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్ పెట్ ఠాణాకు తరలించారు. దీంతో విద్యార్థులు స్టేషన్ లో కూడా నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించి, డిమాండ్లను నెరవేర్చేవరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు.