kasthuri: కస్తూరి కి కోర్టు నోటీసులు ..ఇదంతా తెలుగు వారిపై నోరు పారేసుకున్నందుకేనా ?

కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టు ను ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ పట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Published Nov 14, 2024 02:42:00 PM
postImages/2024-11-14/1731575677_KASTURI.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నోరు పారేసుకుంటే కోర్టు ఊరుకుంటుందా...ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది కోర్టు. తమిళనాడు వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని..కాని వారు నిజానికి అంతపురం లో దాసీలుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని  ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కస్తూరు చేసిన వ్యాఖ్యలపై తెలుగువారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దేశ వ్యాప్తంగా తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.


చెన్నై, మధురై సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. కేసు నమోదు చేసుకొని విచారణకు పిలిచేందుకు ఆమె ఇంటికి పోలీసులు వెళ్లగా తాళం వేసి ఉంది. ఆమె సెల్ ఫోన్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆమె ఇంటికి నోటీసులు అంతికించారు పోలీసులు . ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టు ను ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ పట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
ఫేమ్ కోసం తమిళ , తెలుగు ఘర్షణలు చెలరేగేలా మాట్లాడడం క్షమించరానిది గా భావించి ..ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. మీ మాటలకు ప్రతిఫలం మీరు అనుభవించాల్సిందే అంటున్నారు నెటిజన్లు. మరో వైపు కోర్టు అరెస్ట్ కు ప్లాన్ చేస్తున్నారు. కస్తూరి ప్రస్తుతం పరారీ లో ఉన్నారు.


ఇంతకీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యల ఏంటీ? అంటే హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరుపున బ్రహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవలు చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది. అయినా తెలుగు వారు  క్షమించలేదు. ఇఫ్పుడు కోర్టు కూడా ..అరెస్ట్ కు ప్లాన్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tamilnadu chennai court tamil-actor

Related Articles