Prithvi Raj: పృథ్వీరాజ్‌కు విజయవాడ కోర్టులో బిగ్ రిలీఫ్ 2024-06-27 09:39:30

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో ఫుల్ ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్‌‌( prudhvi raj) కు ఊరట లభించింది. తన భార్య పెట్టిన డౌరీ కేసును విజయవాడ రెండో ఏసీఎంఎం ( acmm) కోర్టు కొట్టేసింది. విచారణలో పృథ్విరాజ్‌పై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. విచారణకు పృథ్వీ రాజ్ హాజరయ్యారు.


అయితే తన భార్య శ్రీలక్ష్మి( sri lakshmi)  అదనపు కట్నం కోసం పృథ్వీరాజ్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ 2016లో కేసు పెట్టారు. ఈ కేసుపై 2017లో రెండో ఏసీఎంఎంలో ఛార్జిషీట్‌( chargesheet)  దాఖలైంది. అప్పట్లో భరణం ఎక్కువ మొత్తంలో ఇవ్వాలంటూ గొడవలు కూడా జరిగాయి.


సినిమాల్లో నటించే ఆయన హైదరాబాద్‌‌ వెళ్లిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడ్డారని, ఆమె ఫిర్యాదు చేయడంతో విజయవాడలోని( vijayawada)  సూర్యారావుపేట ( suryarao peta) స్టేషన్‌లో సెక్షన్‌ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. పిల్లల్ని కూడా భార్యే చూసుకుంటున్నారని తనకు భరణం కావాలని కేసు వేశారు. అయితే ఇప్పుడు పిల్లల బాధ్యత పృథ్వీ రాజ్ చూసుకుంటున్నారని ..అదనపు కట్నం కోసం తన పై జరిగిన ఆరోపణలు నిజంకాకపోవడంతో కోర్టు కేసు కొట్టేసింది.