Actors:భర్తలను మారుస్తూ పిల్లల్ని కన్న సెలబ్రిటీలు.. ఎంతమందంటే.?

మన ఇండియన్ కల్చర్ లో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పూర్వకాలం పెద్దలైతే ఒకసారి పెళ్లి చేస్తే వాళ్ళు చచ్చే వరకు కలిసి ఉండేవారు. వారి మధ్య గొడవలు రాలేదా అంటే  ఎంత పెద్ద గొడవలు వచ్చినా కొన్నాళ్లపాటు మాట్లాడకుండా ఉండి ఆ తర్వాత మళ్లీ కలిసిపోయేవారు.  కానీ ప్రస్తుత కాలంలో చిన్న గొడవ వచ్చిన అది చిలికి చిలికి గాలివానై విడాకుల వరకు దారి తీస్తోంది. ముఖ్యంగా సాధారణ ప్రజల్లో ఇది కాస్త తక్కువగా ఉన్నా కానీ సెలబ్రిటీల్లో మాత్రం విపరీతంగా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్టుగా విడాకులే.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-05/1720149979_srija.jpg

న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియన్ కల్చర్ లో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పూర్వకాలం పెద్దలైతే ఒకసారి పెళ్లి చేస్తే వాళ్ళు చచ్చే వరకు కలిసి ఉండేవారు. వారి మధ్య గొడవలు రాలేదా అంటే  ఎంత పెద్ద గొడవలు వచ్చినా కొన్నాళ్లపాటు మాట్లాడకుండా ఉండి ఆ తర్వాత మళ్లీ కలిసిపోయేవారు.  కానీ ప్రస్తుత కాలంలో చిన్న గొడవ వచ్చిన అది చిలికి చిలికి గాలివానై విడాకుల వరకు దారి తీస్తోంది. ముఖ్యంగా సాధారణ ప్రజల్లో ఇది కాస్త తక్కువగా ఉన్నా కానీ సెలబ్రిటీల్లో మాత్రం విపరీతంగా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్టుగా విడాకులే.

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాదు  భారతదేశంలోని సెలబ్రిటీస్ చాలామంది ఈ విధంగానే ఉన్నారు. ముఖ్యంగా ఒక పెళ్లి చేసుకొని పిల్లల్ని కనీ, మరో పెళ్లి చేసుకొని పిల్లల్ని కని అలా భర్తలను మారుస్తూ, పిల్లల్ని కన్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో విడాకులు అంటే చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. మళ్లీ మరో పెళ్లి కూడా సింపుల్ గానే చేసుకుంటున్నారు. అలా అని చేసుకున్న భర్తలతో పిల్లల్ని కనకుండా ఉంటున్నారా అంటే అది కూడా కాదు. ఎవరిని పెళ్లి చేసుకున్న వారితో ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల్ని కంటున్నారు. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రియే కాకుండా, ఇతర ఇండస్ట్రీలో కూడా ఇద్దరు భర్తలతో పిల్లలు కలిగి ఉన్న సెలెబ్రిటీలు ఎవరు అనే వివరాలు ఇప్పుడు చూసేద్దామా. 

 రజనీకాంత్ కూతురు సౌందర్య :
సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇండియా మొత్తంలో తెలియని వారు ఉండరు.రజనీకాంత్ చిన్న కూతురు పేరు సౌందర్య. ఈమె ఇండస్ట్రీలో దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్ గా  పలు రంగాల్లో వర్క్ చేస్తూ వస్తోంది. అలాంటి ఈమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయట.  2010 సంవత్సరంలో అశ్విన్ రాజ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని, ఒక అబ్బాయి పుట్టాడు.  ఆ తర్వాత మీరు 2017లో విడాకులు తీసుకొని దూరమయ్యారు. ఇక సౌందర్య అంతటితో ఆగకుండా రెండో వివాహం విషాగన్ అనే వ్యక్తిని చేసుకుంది. వీరిద్దరికి కూడా ఒక అబ్బాయి పుట్టాడు. 

 చిరంజీవి కూతురు శ్రీజ:
 ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుపొందిన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ అంటే తెలియని వారు ఉండరు. ఈమె సినిమాల్లో నటించకపోయినా కానీ పెళ్లిళ్ల ద్వారానే చాలా ఫేమస్ అయ్యింది. శ్రీజ చదువుకునే సమయంలోనే తన క్లాస్మేట్ శిరీష్ భరద్వాజను  ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ తర్వాతవిడాకులు తీసుకున్నారు. మళ్లీ 2016లో నటుడు కళ్యాణ్ దేవుని రెండవ పెళ్లి చేసుకుంది. వీరికి కూడా ఒక అమ్మాయి పుట్టింది ఆమె పేరు నవిష్క. వీరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అయితే తాజాగా శ్రీజ మొదటి భర్త అనారోగ్యం కారణంగా చనిపోయారు. 

 అలనాటి నటి రాధిక :
 90S హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది రాధిక. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి నటులతో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈమె 1985లో ప్రతాప్ పోతన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ విడాకులు అయ్యాయి. 2001లో నటుడు శరత్ కుమార్ ని రెండవ పెళ్లి చేసుకుంది. వీరికి రోహిత్ అనే అబ్బాయి కూడా పుట్టారు. అయితే మొదటి భర్తతో  కూడా ఒక కొడుకు పుట్టాడని సమాచారం అందుతుంది. ఈ విధంగా ఇండస్ట్రీలో రెండు అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కల్లా సెలబ్రిటీలు వీరే. ప్రస్తుతం వీటికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce radhika soundarya-rajinikanth srija-chiru

Related Articles