ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా టిడిపి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘటన గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిమూలంతో పార్టీలో పనిచేసే ఒక మహిళ
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా టిడిపి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘటన గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిమూలంతో పార్టీలో పనిచేసే ఒక మహిళ ఆదిమూలం నాపై లైంగిక దాడి చేశాడంటూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇది కాస్త సంచలనంగా మారడంతో ఆదిమూలం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి టిడిపి అధిష్టానం ఆదిమూలమును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా ఆదిమూలం ఈ తతంగంపై స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఆదిమూలం మీడియాతో మాట్లాడుతూ నేను ప్రతిక్షణం ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేసుకునే వ్యక్తిని, అలాంటి నాపై ఆ మహిళా అధ్యక్షురాలు అబాండ వేయడం మంచి పద్ధతి కాదు. ఎన్నికల టైంలో నాతోపాటు ప్రచారంలో తిరిగింది. ప్రస్తుతం కావాలని నాపై కుట్ర చేసి ఆరోపణలు చేస్తోంది. నేను కిందిస్థాయి నుంచి వచ్చిన నాయకుడిని 50 సంవత్సరాలుగా పాలిటిక్స్ లో ఉన్నాను. ఇప్పటివరకు నాపై ఇలాంటి ఆరోపణలు ఎక్కడా లేవు. నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే మీరే చెక్ చేసుకోండి. అయితే నాపై కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కుట్ర పన్ని ఈ విధంగా ఆరోపణలు చేయించారు.
నేను ఆ అమ్మాయిని ఎక్కడ వేధించలేదు. ఆమెను నా సోదరిగానే భావించాను. నేను ఎలాంటి తప్పు ఎరగను. అసలు ఆమె అక్కడికి ఎలా వచ్చిందో, ఎలా పోయిందో నాకు తెలియదు నా బిడ్డల, దేవుడి సాక్షిగా చెబుతున్నాను. నేను తప్పు చేశానా లేదా అనేది ఆమెనే డైరెక్ట్ గా అడగండి. లేదంటే నా నియోజకవర్గ ప్రజలను అడగండి. నా క్యారెక్టర్ ఏంటో వారే చెబుతారు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే భగవంతుడే నన్ను శిక్షిస్తాడు. అది పూర్తిగా మార్ఫింగ్ వీడియో కుట్ర కోణంలో భాగంగానే దీన్ని అలా చేసి బయటకు రిలీజ్ చేశారు అంటూ ఆదిమూలం షాకింగ్ కామెంట్స్ చేశారు.