వాటిలో 2.74లక్షల దరఖాస్తులను పరిగణలోకి తీసుకున్నట్లు సర్కార్ వెల్లడించింది. అయితే, రైతు బీమా ద్వారా 18-59 ఏళ్ల వయసున్న వారికే ప్రభుత్వం లబ్ధి కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ధాన్యంపై క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యానికి మాత్రమే బోనస్ అంటూ ప్లేట్ ఫిరాయించిన విషయం తెలిసిందే.
అయితే, ఇప్పటికీ రైతుబంధుపై నోరుమెదపని ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమాపై కొత్త మెలిక పెట్టింది. ఈ నెల 15 నుంచి 2024-25 రైతు బీమా సంవత్సరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రైతు బీమాకు దరఖాస్తు గడువు ఈ నెల 5తోనే ముగిసింది.
తాజగా వచ్చిన వాటిలో 2.74లక్షల దరఖాస్తులను పరిగణలోకి తీసుకున్నట్లు సర్కార్ వెల్లడించింది. అయితే, రైతు బీమా ద్వారా 18-59 ఏళ్ల వయసున్న వారికే ప్రభుత్వం లబ్ధి కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే, 50 ఏళ్లకు మించిన వారిని ఈ పథకం నుండి తొలగించనున్నారు. 60 ఏళ్లు మించిన రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరదు. దీంతో మొత్తం 47.87లక్షల మందికి మాత్రమే రైతు బీమా వర్తించనుంది.