ROWDY WEAR: ‘రౌడీ వేర్’ బ్రాండ్ కు “ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్” !

స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డు రౌడీ వేర్ బ్రాండ్ గెలుచుకుంది. విజయ్ దేవరకొండ బిజీ గా ఉండడంతో ఆనంద్ దేవరకొండ ఈ అవార్డును అందుకున్నారు.


Published Nov 25, 2024 09:58:00 PM
postImages/2024-11-25/1732552131_vijay.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ ..రౌడీ వేర్ గురించి అందరికి తెలిసిందే. యూత్ లో ఈ బ్రాండ్ కున్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఔట్ లుక్ ఇండియా నిర్వహించిన బిజినెస్ అవార్డ్స్ 2024 లో ఐకాన్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డు రౌడీ వేర్ బ్రాండ్ గెలుచుకుంది. విజయ్ దేవరకొండ బిజీ గా ఉండడంతో ఆనంద్ దేవరకొండ ఈ అవార్డును అందుకున్నారు.


దీని పై హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రౌడీ వేర్ ను ఐకానిక్ బ్రాండ్ గా మార్చిన రౌడీస్ తో పాటు తన రౌడీ వేర్ టీమ్ కు విజయ్ దేవరకొండ థ్యాంక్స్ చెప్పారు. తన సక్సస్ లో ఇది కూడా ఒక భాగమని అన్నాడు విజయ్. అంతేకాదు తన బ్రాండ్ ను సూపర్ సక్సస్ చేసిన తన ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ తెలిపాడు.


 స్టైలింగ్, మేకోవర్ లో తనకున్న ప్యాషన్ తో రౌడీ వేర్ బ్రాండ్ ను ఎప్పటికప్పుడు సరికొత్తగా యూత్ కు రీచ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది మరింత జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vijaydevarakonda rowdy-hero

Related Articles