డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభిత జంట వివాహం జరగనుంది. ఎం తసైలెంట్ గా పెళ్లి పనులు చేస్తున్నా ..ఎక్కడో ఒక దగ్గర విషయం బయటపడుతుందిగా. అయితే ఈ పెళ్లి స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాగచైతన్య , శోభిత ధూళిపాళ పెళ్లి త్వరలో జరుగుతుంది. అయితే వీరి పెళ్లి స్ట్రీమింగ్ రైట్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.నిశ్చితార్థం సింపుల్‌గా ముగించినా, పెళ్లిని ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభిత జంట వివాహం జరగనుంది. ఎం తసైలెంట్ గా పెళ్లి పనులు చేస్తున్నా ..ఎక్కడో ఒక దగ్గర విషయం బయటపడుతుందిగా. అయితే ఈ పెళ్లి స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈ పెళ్లికి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ ఇలా పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది.
అయితే నయనతార - విఘ్నేష్ శివన్ జంటకు రూ.25 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. కాని శోభిత్ , నాగచైతన్య పెళ్లికి మాత్రం 50 కోట్లు ఇస్తుందట నెట్ ఫ్లిక్స్. ఈ వార్త సినీ వర్గాల్లో చాలా మంది ఆశ్చర్యపరిచింది.
అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా రాణిస్తున్న నాగచైతన్య. యువ సామ్రాట్‌గా మెప్పిస్తున్న ఆయన 2017లో నటి సమంతను వివాహం చేసుకున్న విసయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, నాలుగేళ్లలో విడాకులు తీసుకుని విడిపోయారు. సమంతతో విడాకుల తర్వాత నటి శోభిత ధూళిపాళ్లను ప్రేమించారు నాగ చైతన్య. చాలా సీక్రెట్ మెయింటైన్ చేశారు కాని..ఫారన్ లో చాలా చోట్ల కెమరా కంటికి చిక్కారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.