WEDDING CARD: వామ్మో పెళ్లి కార్డుతోను స్కామే..1750 కోట్లు దోచేసిన స్కామర్లు !

జాగ్రత్త పడడానికి కూడా అవ్వనంతగా సూపర్ ఫాస్ట్ లో స్కాం చేస్తున్నారు. రీసెంట్ గా పెళ్లి కార్డులు పంపి దాదాపు 1750 కోట్లు కొట్టేశారట స్కామర్స్.


Published Nov 26, 2024 10:25:00 PM
postImages/2024-11-26/1732640171_673ac8867e629whatsappweddingcardscam18542513616x9.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్కామ్స్ గురించి ఈ రోజుల్లో తెలియని వాళ్లు లేరు. ఈజీ మనీ కోసం ఏవేవో చేస్తున్నారు. జస్ట్ టచ్ చేసి లక్షలు పోగొట్టుకున్నవారు వేలల్లో ఉన్నారు. అయితే జాగ్రత్త పడడానికి కూడా అవ్వనంతగా సూపర్ ఫాస్ట్ లో స్కాం చేస్తున్నారు. రీసెంట్ గా పెళ్లి కార్డులు పంపి దాదాపు 1750 కోట్లు కొట్టేశారట స్కామర్స్.


పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో , మనలో చాలా మందికి ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఆహ్వానాలు అందుతున్నాయి. అయితే తెలియని వారి నుంచి కార్డులు, పెళ్లి కార్డులు కాని ఓపెన్ చేశారా మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇఫ్పుడు స్కామర్స్ వాడుతున్న మాత్రం ఇదే.. మీ వాట్సాప్ కు సడన్ గా ఓ ఇన్విటేషన్ వస్తుంది.  అది మీరు ఓపెన్ చెయ్యగానే..మీ ఫోన్ స్కామర్స్ చేతిలో ఉన్నట్లే ..చక్కగా మీ అకౌంట్లో డబ్బులన్నీ ...పోతాయి. వివాహ ఆహ్వానాన్ని కలిగి ఉన్న ఒక సాధారణ వాట్సాప్ మెసేజ్ కాని వస్తే ..సో నెవర్ ఓపెన్ ఇట్ .


హిమాచల్ ప్రదేశ్‌లోని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుండి డిఐజి మోహిత్ చావ్లా, అయాచిత వివాహ ఆహ్వానాలు వస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల చాలా చోట్ల చాలా కేసులు కూడా నమోదయినట్లు పోలీసులు తెలిపారు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని ...నెంబర్ తెలికుండా వచ్చే మెసేజ్ లు కాని కాల్స్ కాని అవాయిడ్ చెయ్యండి. ఇలాంటి స్కామ్స్ వల్ల దాదాపు 1750 కోట్లు కొల్లగొట్టేశారు స్కామర్స్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding whatsapp scamers

Related Articles