allu arjun: బన్నీ ఫ్యాన్ క్రేజీ ఫీట్ ..1600 కిమీ సైకిల్ పై ప్రయాణించిన ఫ్యాన్ !

నార్త్ లో ఇఫ్పుడు అ్లలుఅర్జున్  క్రేజ్ మామూలుగా లేదు. పుష్ఫ  రిలీజ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లోను అల్లుఅర్జున్ క్రేజ్ సూపర్ గా బిల్డ్ అయ్యింది.  


Published Oct 16, 2024 07:23:00 PM
postImages/2024-10-16/1729086945_1381140bunnygadu.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  రీసెంట్ గా కొహ్లీ ని కలవడానికి  వేల కిమీ సైకిల్ తొక్కి వచ్చాడు ఓ కుర్రాడు...సేమ్ టు సేమ్ అలాగే...అల్లుఅర్జున్ ను కలవడానికి  ఓ ఫ్యాన్ ఇలానే వేల కిమీ సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.  నార్త్ లో ఇఫ్పుడు అ్లలుఅర్జున్  క్రేజ్ మామూలుగా లేదు. పుష్ఫ  రిలీజ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లోను అల్లుఅర్జున్ క్రేజ్ సూపర్ గా బిల్డ్ అయ్యింది.   ముఖ్యంగా పుష్ప మూవీలోని 'తగ్గేదేలే' డైలాగ్ మేనరిజానికి అక్కడి ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. అలా ఆయన నటన, డ్యాన్స్, డైలాగ్స్​కు అభిమాని అయిన ఓ వ్యక్తి, బన్నీని కలిసేందుకు ఏకంగా 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. అతనికి ..వార్మ్ వెల్ కమ్ దక్కింది.


ఉత్తర్​ప్రదేశ్ అలీగఢ్​కు చెందిన బన్నీ ఫ్యాన్ ఒకరు ఆయన్ను కలిసేందుకు సైకిల్​పై హైదరాబాద్ వచ్చారు.  దాదాపు 1600 కిలోమీటర్లు  సైకిల్ తొక్కుకొని వచ్చారు. రిటర్న్ లో సైకిల్ పై కాకుండా ఫ్లైట్ లో వెళ్లాలా ఏర్పాటు చెయ్యాలని తన టీం కు చెప్పారు అల్లుఅర్జున్ . అయితే తను సేఫ్ గా ఇంటికి తిరిగి వెళ్లాలని బన్నీ సూచించారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ తియ్యాలని తన టీం కు చెప్పాడట.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్​కు తన ఫ్యాన్స్​ పట్ల ఎంతో ప్రేమ ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun pushpa fans uttarapradesh

Related Articles