టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.. అందులో పెద్దబ్బాయి తండ్రి బాటలోనే నడిస్తే మిగిలిన ఇద్దరు అబ్బాయిలు హీరోలుగా మారారు. ఇక ఇందులో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. కానీ అల్లు శిరీష్ మాత్రం హీరోగా గుర్తింపు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న బడ్డీ మూవీ వచ్చే నెల అంటే జూలై 26న విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ మాట్లాడుతూ..ఈ ట్రైలర్ చూశాక నాకు ఈ మూవీపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది.అలాగే ఈ మూవీకి జ్ఞానవేల్ బడ్జెట్ ఎక్కువగానే పెట్టారు.మా నాన్న కూడా నాపై ఇన్ని డబ్బులు ఎప్పుడు ఖర్చుపెట్టలేదు అంటూ ఆ ఈవెంట్ లో మాట్లాడారు.అయితే కొంతమంది నెటిజన్స్ అంత పెద్ద ఈవెంట్లో అల్లు శిరీష్ తండ్రిని అవమానించారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.. అందులో పెద్దబ్బాయి తండ్రి బాటలోనే నడిస్తే మిగిలిన ఇద్దరు అబ్బాయిలు హీరోలుగా మారారు. ఇక ఇందులో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. కానీ అల్లు శిరీష్ మాత్రం హీరోగా గుర్తింపు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈయన నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో అల్లు శిరీష్ కి ఇండస్ట్రీలో కనీసం మిడిల్ రేంజ్ హీరోగా కూడా స్థానం రావడం లేదు.దీంతో అల్లు అరవింద్ కూడా చిన్న కొడుకు విషయంలో కాస్త బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. కానీ కొద్ది రోజులుగా అల్లు శిరీష్ కి ఫ్యామిలీతో గొడవలు జరుగుతున్నాయని, అల్లు శిరీష్ ని అరవింద్ పట్టించుకోవడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ మాట్లాడిన మాటలు తండ్రిని అగౌరవపరిచినట్టుగా ఉన్నాయి.దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే భేదాభిప్రాయాలు ఉన్నట్టు కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక విషయంలోకి వెళ్తే.. అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న బడ్డీ మూవీ వచ్చే నెల అంటే జూలై 26న విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ మాట్లాడుతూ... నేను బడ్డీ పోస్టర్ని గత ఏడాది రిలీజ్ చేసిన సమయంలో చాలామంది ఇప్పటికే ఈ సినిమా ఓటీటి లో వచ్చేసింది చూసేసాం అంటూ ఎన్నో ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ నేను ఎన్ని చెప్పిన వాళ్ళు పట్టించుకోరు.దాంతో నేను చెప్పడం కూడా మానేశాను. అయితే ఈ ట్రైలర్ చూశాక నాకు ఈ మూవీపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. అలాగే ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డినే. ఈ మూవీ కాన్సెప్ట్ బాగుండడంతో ఇందులో చేయడానికి ఒప్పుకున్నాను.అలాగే ఈ మూవీకి జ్ఞానవేల్ బడ్జెట్ ఎక్కువగానే పెట్టారు.మా నాన్న కూడా నాపై ఇన్ని డబ్బులు ఎప్పుడు ఖర్చుపెట్టలేదు అంటూ ఆ ఈవెంట్ లో మాట్లాడారు. అయితే అల్లు శిరీష్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్స్ అంత పెద్ద ఈవెంట్లో అల్లు శిరీష్ తండ్రిని అవమానించారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు