Amala Paul: కొడుకు ఫేస్ రివీల్ చేసిన అమలా పాల్.?

సెప్టెంబరు 15 ఆదివారం ఓనం శుభాకాంక్షలు చెబుతూ కొడుకు, భర్త జగత్ దేశాయ్‌లతో దిగిన అద్భుతమైన ఫోటోలను ఇన్ స్టాలో పంచుకుంది


Published Sep 15, 2024 07:14:00 PM
postImages/2024-09-15/1726408151_amalapaulandjagatdesai15450411016x90.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమలాపాల్ ..కెరియర్ పీక్ లో ఉన్నపుడు పెళ్లి చేసుకుంది. అంతే కంగారుగా విడాకులు తీసుకొని ..రెండో పెళ్లి కూడా చేసుకుంది. రీసెంట్ గా కొడుకు కూడా పుట్టాడు.సెప్టెంబరు 15 ఆదివారం ఓనం శుభాకాంక్షలు చెబుతూ కొడుకు, భర్త జగత్ దేశాయ్‌లతో దిగిన అద్భుతమైన ఫోటోలను ఇన్ స్టాలో పంచుకుంది. 


అమలాపాల్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ తో తెలుగులో చేసిన సినిమాలు సూపర్ హిట్ కాగా.. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం రాలేదు. కాని ఫేమ్ మాత్రం వచ్చింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2023లో వీరి వివాహం కేరళలోని కొచ్చిలో జరిగింది. ఈ ఏడాది జూన్‏లో కొడుకు పుట్టాడు. భర్త జగత్ దేశాయ్ తో దిగిన అధ్భుతమైన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.నదిలో పడవలో కొడుకు, భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. బాబు ఫేస్ రివీల్ చేసింది.


కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన మూడేళ్లకే వీరిద్దరు విడిపోయారు. గతేడాది జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకుంది.కొడుకు పేరు ఇళయ్..రీసెంట్ గా ఆడు జీవితంలో కనిపించి హిట్టు కొట్టింది. 
 

newsline-whatsapp-channel
Tags : social-media tamilanadu amala-paul

Related Articles