Anant Ambani Haldi: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ హల్దీ..హాడావిడి చేసిన రణవీర్, హార్ధిక్ పాండ్యా...

హార్దిక్ పాండ్యా చాలా ఎంజాయ్ చేశాడు. కుటుంబం మరియు వారి అతిథులు హల్దీ మరియు పువ్వులు ఆడారుఅనంత్ మరియు రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో హల్దీ తో హోలీ చేశారు.


Published Jul 27, 2024 02:35:58 AM
postImages/2024-07-27/1722062277_anantradhika.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ పెళ్లి అంతా ఒకెత్తు ...హాల్దీ ఒకటి ఒకెత్తు. రణవీర్ , హార్ధిక్ పాండ్యా అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో..సోషల్ మీడియా అంతా ఫుల్ వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ నటీనటులు అదరగొట్టారు . సింగ్ మరియుహార్దిక్ పాండ్యా చాలా ఎంజాయ్ చేశాడు. కుటుంబం మరియు వారి అతిథులు హల్దీ మరియు పువ్వులు ఆడారుఅనంత్ మరియు రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో హల్దీ తో హోలీ చేశారు.


వైరల్ వీడియోలో, రణవీర్ పువ్వులు విసురుతూ , పసుపు రాసుకుంటూ అసలు మామూలు హడావిడి చేశారు.  హార్దిక్ దగ్గర నిలబడి భాంగ్రా చేస్తున్నాడు. మధ్యలో, ఇద్దరూ గర్బా చేయడం కూడా చేశారు. మరోవైపు, వరుడు అనంత్ తన తల్లి నీతా మరియు సోదరుడు ఆకాష్‌ను హల్దీతో ముంచేశారు . రాధిక కూడా పసుపు రాసుకొని డ్యాన్స్ చేస్తూ తన తల్లి , అక్క , అనంత్ అంబానీతో స్టెప్పులు వేయడం కనిపిస్తుంది.


అసలు హల్దీ లో ఎంత ఎంజాయ్ చెయ్యాలో అంత ఎంజాయ్ చేశారు. అయితే మార్చి నుంచి జరుగుతున్న వేడుకలు ఇప్పటికీ ముగియలేదు. ఇప్పుడు ఈ జంట వివాహానంతర వేడుకలు దాదాపు రెండు నెలల పాటు లండన్‌లో జరగనున్నాయి. నిజంగా ఎంజాయ్ చెయ్యడం అంబానీ ఫ్యామిలీని చూసి నేర్చుకోవల్సిందే. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding ananth-ambani

Related Articles