ఫిష్ వెంకట్ కు సాయమందించిన చిరు, రామ్ చరణ్..ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీలో విలన్ కామెడీ నటులు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది ఫిష్ వెంకట్ మాత్రమే. ఆయన నటన తీరు చాలా వెరైటీగా ఉంటుంది.  మాట నుంచి మొదలు ముఖ కదలికలన్నీ  మనకు


Published Sep 07, 2024 06:20:22 PM
postImages/2024-09-07/1725713422_venkat.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో విలన్ కామెడీ నటులు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది ఫిష్ వెంకట్ మాత్రమే. ఆయన నటన తీరు చాలా వెరైటీగా ఉంటుంది.  మాట నుంచి మొదలు ముఖ కదలికలన్నీ  మనకు నవ్వు తెప్పించేలా ఉంటాయి. ఎన్టీఆర్ ఆది చిత్రంలో తొడగొట్టు చిన్న అనే గంభీరమైన డైలాగుతో  వెంకట్  ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. వందలాది చిత్రాల్లో తన కామెడీతో అందరిని కడుపుబ్బ నవ్వించాడు.

 ఎంతోమందిని అలరింప చేసిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నాడు.  కనీసం తినడానికి తిండి లేని పరిస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు సినిమాల్లో ఎంతో ఎదిగినటువంటి ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు.  

దీనికి తోడు డయాబెటిస్, బిపి, కాలు ఇన్ఫెక్షన్,  రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం ఆయనను మరింత దెబ్బతీశాయి. అలాంటి ఫిష్ వెంకట్ తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన దీనస్థితి గురించి చెప్పుకున్నాడు. ఇది చూసిన ఎంతోమంది ఇంత మంచి నటుడుకి ఏమైంది ఇలా తయారయ్యడేంటి అంటూ బాధపడిపోతున్నారు. ఇదే తరుణంలో ఆయన దీన పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ స్పందించారట. తనకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఆరోగ్య సమస్యలు కూడా తీరుస్తామని ఏదైనా సరే ఇబ్బంది లేకుండా అడగండి అంటూ ఫోన్ చేసి మాట్లాడారట. ఫిష్ వెంకట్ కు భరోసా ఇచ్చారని తెలుస్తోంది.

ఈయనే కాకుండా ప్రముఖ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు కూడా ఫిష్ వెంకట్ కు లక్షల సాయం చేశారట. అంతేకాకుండా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కూడా ఫిష్ వెంకట్ కు కాల్ చేసి నీకు నేనున్నాను ఏం బాధపడకు అని భరోసా ఇచ్చారట.  ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది ప్రముఖులు ఫిష్ వెంకట్ కు కాల్ చేస్తున్నారని ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఆయన దీనస్థితిని చూసినటువంటి చాలామంది అభిమానులు ఫిష్ వెంకట్ తొందరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.

https://x.com/HumanTsunaME/status/1831744503218368894?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1831744503218368894%7Ctwgr%5Eaf07a90b5af4f36545e409c414fad25137d48971%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

newsline-whatsapp-channel
Tags : chiranjeevi news-line dil-raju ramcharan fish-venkat chadalawada-srinivasarao

Related Articles