Anasuya: మొహం నిండా  గాయాలతో యాంకర్ అనసూయ.. షాక్ లో ఫ్యాన్స్.?

యాంకర్ అనసూయ అంటే సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తుంది. అలా ఇప్పటికే ఎన్నో మంచి మంచి 


Published Aug 09, 2024 02:12:27 PM
postImages/2024-08-09/1723192947_anasuyasimbamovie.jpg

న్యూస్ లైన్ డెస్క్: యాంకర్ అనసూయ అంటే సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తుంది. అలా ఇప్పటికే ఎన్నో మంచి మంచి సినిమాల్లో కీ రోల్స్ పోషించి యాంకరింగ్ కి  పూర్తిగా గుడ్ బై చెప్పి సినిమాల్లోనే రాణిస్తుంది  ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప లో విలన్ గా కూడా నటించి తన సత్తా ఏంటో చాటుకుంది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా మొహం నిండా గాయాలతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. మొహం నిండా రక్తపు చుక్కలే. దీంతో అనసూయ గాయాలను చూసి చాలామంది జనాలు అసలు అనసూయ కి ఏమైంది.. యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా.. మొహం నిండా ఆ రక్తం ఏంటి అని షాక్ అవుతున్నారు.ఇక అభిమానులైతే ఆందోళన పడుతున్నారు. అయితే నిజంగానే అనసూయకి యాక్సిడెంట్ అయి ఏదో జరిగిపోయింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.

ఎందుకంటే అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ కింద ఇచ్చిన ట్యాగ్ ద్వారా ఇది సినిమా షూటింగ్లో బాగామని తెలుస్తోంది.తాజాగా అనసూయ ముఖ్యపాత్ర పోషించిన సింబా సినిమా విడుదలైంది.ఈ సినిమాలో జగపతిబాబు కీ రోల్ పోషించారు. అయితే ఈ సినిమా సమయంలో విలన్స్ తో ఫైటింగ్ చేసిన సమయంలోని యాక్షన్ ఫోటోలను అనసూయ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఇక ఈ ఫొటోస్ కింద సింబా మూవీ యాష్ ట్యాగ్ పెట్టింది.దీంతో ఇది సింబ మూవీలోని ఫోటో అని అందరికీ అర్థమయిపోయింది. సింబా సినిమా షూటింగ్ సమయంలో తాను ఎంతగా కష్టపడి నటించిందో ఆ కష్టాన్నంతా ఈ ఫోటోల రూపంలో బయట పెట్టింది.ఇక తాజాగా అంటే ఆగస్టు 9న విడుదలైన సింబా మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా చూసిన జనాలు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

https://www.instagram.com/p/C-b2GwtynmO/?utm_source=ig_web_copy_link

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pushpa anchor-anasuya simba-movie jagapathi-babu

Related Articles