ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. బిగ్ బాస్ ఎంట్రీ మీద, తన ఫ్రెండ్ రీతూ చౌదరి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్ : యాంకర్ విష్ణు ప్రియా అంటే టాలీవుడ్ లో, టీవీ ఇండస్ట్రీలో పరిచయం లేని వారు ఉండరు. షార్ట్ ఫిలింస్ తో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత కెరీర్ లో మంచి పొజిషన్ కి చేరుకుంది విష్ణుప్రియ. పలు టీవీ ఛానల్స్ లో యాంకర్ గా చేసి మెప్పించింది. పోరాపోవే అనే ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన షో చాలామందిని ఆకట్టుకుంది. తన మాటలు, అందం, టాలెంట్ తో అవకాశాలు పట్టేస్తున్న విష్ణుప్రియా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్య విష్ణుప్రియ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు ట్రెండింగ్ లో నిలిచాయి. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం మిస్ అయిందంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. బిగ్ బాస్ ఎంట్రీ మీద, తన ఫ్రెండ్ రీతూ చౌదరి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి రీతూ చౌదరి, విష్ణుప్రియా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు, రీల్స్ షేర్ చేస్తూ వారి స్నేహం గురించి చెప్పకనే చెప్పారు. ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి కూడా వెళ్తుంటారు. ఈ మధ్యే కిరాక్ బాయ్.. కిలాడీ లేడీస్ అనే ప్రోగ్రామ్ లో కూడా రీతూ, విష్ణుప్రియా ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ షో గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇద్దరూ చిత్రమైన సమాధానాలు చెప్పారు. కాగా అందులో విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. షోకి సంబంధించి రెమ్యూనరేషన్ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారా? లేక విడివిడిగా మాట్లాడుకున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. రీతూ సెపరేట్ సెపరేట్ గానే పేమెంట్ మాట్లాడుకున్నాం అని చెరప్పింది. ఇద్దరినీ విడివిడిగానే అప్రోచ్ అయ్యారంటూ వివరించింది. అయితే.. వెంటనే స్పందించిన విష్ణుప్రియా వెటకారం జత చేసి రీతూగారు చాలా ఫేమస్. ఇన్ స్టాలో.. షోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో ఉంటుంది. అందుకే రీతూ అనే ఫేమస్ పీస్ ను ముందు సెలెక్ట్ చేసుకున్నారు. నేను తుప్పు పట్టిపోయిన పీస్. చాలారోజులైంది నేను తుప్పుపట్టి. అందుకే.. తక్కువలో వస్తుందని చివరి ఆప్షన్ గా నన్ను షోకి పిలిచారు అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత సెటైరికల్ గా మాట్లాడుకునే లేడీ ఫ్రెండ్స్ వీరిద్దరేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు.