Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ల రేట్లు పెంచడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !

ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.


Published Jan 04, 2025 08:07:00 PM
postImages/2025-01-04/1736001521_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , సౌతిండియా స్టార్ డైరక్టర్ శంకర్ కాంభినేషన్ లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.


బెనిఫిట్ షో టికెట్ రూ.600 చొప్పున విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటలకు గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు వేయనున్నారు. ఈ నెల 10న ఆరు షో అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ పై అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై అదనంగా రూ. 135 వరకు పెంచుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ పెంచే అవకాశం లేదు. ఇవే ధరలతో జనవరి 11 నుంచి 23 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభఉత్వం అనుమతి మంజూరు చేసింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shankar-director game-changer

Related Articles