ఇప్పటికే ప్రమోషన్లలో చిత్ర యూనిట్ చాలా బిజీగా గడుపుతోంది. ఈ సంక్రాంతి బాలయ్య ఖాతాలో వేసుకోవడానికి ఫుల్ జోష్ లో వస్తున్నాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొల్లి బాబీ డైరక్షన్ లో వస్తున్న మూవీ డాకూ మహారాజ్ .ఈ మూవీని సూర్య దేవర నాగవంశీ , సౌజన్య కలిసి చేస్తున్న సినిమా . శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లలో చిత్ర యూనిట్ చాలా బిజీగా గడుపుతోంది. ఈ సంక్రాంతి బాలయ్య ఖాతాలో వేసుకోవడానికి ఫుల్ జోష్ లో వస్తున్నాడు.
అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్లంతా ఆయనను డాకు అనే వాళ్లు. నాకు మాత్రం మహారాజు. అలా కథతో మొదలవుతుంది.నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా..? చెప్పింది వినాలి.. ఇచ్చింది తీసుకోవాలి. అనే డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. యాక్షన్స్ అదుర్స్ అనిపించాయి. ఈ ఫారస్ట్ లో పులీ , ఎలుగుబంటి వస్తే ఎలా అంటూ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మ అంటూ పాప చెప్పే డైలాగ్ మూవీ కి స్పెషల్ హైలెట్ . ఇక ఈ సారి ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్నారు మైవీ టీం.