ananth sriram: కల్కి సినిమా పై షాకింగ్ కమెంట్లు చేసిన అనంత్ శ్రీరామ్ !

ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


Published Jan 05, 2025 06:35:00 PM
postImages/2025-01-05/1736082335_AnanthaSriram.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు గేయ రచయితల్లో అనంత్ శ్రీరామ్ మరోసారి షాకింగ్ కమెంట్లు చేశారు. మన దీక్ష  దేవాలయ రక్ష అని విజయవాడ లో విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు బహిరంగ సభలో అన్నారు. ఈ సభకు అనంత్ శ్రీరామ్ ముఖ్యఅతిథిగా వ్యవహరించారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


ఈ మీటింగ్ లో మాట్లాడుతూ ..అనంత్ శ్రీరామ్  మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో హైందవ ధర్మం పై దాడి  జరుగుతుందని, ముఖ్యంగా సినిమాల్లో హైందవ పురాణాలను వక్రీకరిస్తున్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని, కొందరు అన్యమతస్తుల ప్రవర్తన ఇబ్బమంది పెడుతోందని గుర్తు చేశారు. సరిగ్గా కధ తెలీకుండా వక్రీకరించి చెబుతున్నారనన్నారు.


కల్కీ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని, ఆయన్ను సురుడు అంటే ఎవరు ఒప్పుకోరని..సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చారు. అలాగే ఎవరు చేసిన తప్పును తప్పు అని చేప్పాలస్సిందేనని సినీ గేయ  రచయిత అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ లో తప్పు ఎవరు చేసినా మాట్లాడాలని ..న్యాయం ఏ ఒక్కరికి సొంతం  కాదని అన్నారు.

newsline-whatsapp-channel
Tags : kalki comments movie-news karna

Related Articles