రైతులు సంతోషంగా జరుపుకునే పండుగ. సంక్రాంతి రోజు ప్రతి హిందువు కొన్ని పనులు చెయ్యాల్సిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హిందువులకు సంక్రాంతి ప్రత్యేకమైన పండుగ. సంక్రాంతి రోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు . అందుకే ఈ రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే దీనికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఈ పండుగ సమయానికి రైతులకు పంటలు చేతికి వస్తాయి. దీంతో రైతులు సంతోషంగా జరుపుకునే పండుగ. సంక్రాంతి రోజు ప్రతి హిందువు కొన్ని పనులు చెయ్యాల్సిందే.
* సంక్రాంతి నాడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుందని అందరూ నమ్ముతారు.
* సంక్రాంతి రోజు పుణ్యనదుల్లో స్నానం చెయ్యడం చాలా ముఖ్యం..పుణ్యం కూడా.
* భోగి సంక్రాంతి నాడు ఎంతో పవిత్రంగా భావించి దేవాలయాలకు వెళ్లడం లేక ఇంట్లో పూజలు చేయడం వంటివి చేస్తారు.
* సంక్రాంతి , భోగి రెండు రోజులు శాఖాహారం తింటారు. కనుమ రోజు మాత్రం నాన్ వెజ్ తో కుమ్మేస్తారు. అయితే సంక్రాంతి రోజు మాత్రం మాంసాహారం తినకూడదు.
* సంక్రాంతి రోజు చేసే దానాలు, ధర్మాలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది .
* పితృకర్మలు చేయని వారు..పితృదేవతలను సంతోషపరచడానికి కూడా సంక్రాంతి దాన ధర్మాలు మంచి చేస్తాయని అంటున్నారు పండితులు.