sankranthi: సంక్రాంతికి దాదాపు 52 ప్రత్యేక రైళ్లు !

చాలా ఊర్లను కలుపుతూ 6 నుంచి 18 వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. 


Published Jan 05, 2025 06:52:00 PM
postImages/2025-01-05/1736083423_sankrantispecialtrains2024.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యేస్ చెబుతుంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని కొంత కొత్త రైళ్లు వేసింది ప్రభుత్వం.మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చాలా ఊర్లను కలుపుతూ 6 నుంచి 18 వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. 


ఇప్పటికే పలు స్పెషల్ రైళ్లను ప్రకటించిన రైల్వే  ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగ రద్దీకి తగ్గట్టుగా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే ప్రకటించింది. ఈసారి సంక్రాంతి కోసం ఇప్పటికే 122 స్పెషల్ రైళ్లను సిద్ధం చేసినట్లుగా తెలిపింది. వీటికి అదనంగా మరో 60 రైళ్లు నడుపుతారు.వీటితో పాటు మరో 90 పాసింగ్ త్రూ రైళ్లను కూడా నడిపిస్తున్నట్లుగా వివరించారు. 


మరో వైపు ఉన్న రైళ్లకు బోగీలను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల అవసరాన్ని 'క్యాష్' చేసుకుంటున్నారు.ఒక్కో టికెట్ ను దాదాపు 2 వేల రూపాయిల నుంచి 5 వేల రూపాయిల మధ్య వసూలు చేస్తున్నారు.కాబట్టి ప్రయాణికులు రైల్వే ను ఉపయోగించుకోవాలని కోరింది. 
 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu train

Related Articles