మైక్ లో మాట్లాడుతూ విశాల్ చేతులు షివర్ అవ్వడం అభిమానులను చాలా టెన్షన్ పడుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : విశాల్ గురించి తెలిసిందేగా...ఆరుడగులు ..ఛామన ఛాయ తమిళహీరోగా చాలా మంచి పేరు సాధించాడు. పందెంకోడి, పొగరు, భరణి , పూజ లాంటి చాలా హిట్ సినిమాలు చేశారు. అయితే గతేడాది రత్నం సినిమా తెలుగు లో రిలీజ్ చేశారు. తర్వాత నుంచి సినిమాలే కాదు అసలు కనిపించడమే మానేశారు. ఏమైందో ఏంటో తెలీదు సడన్ గా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విశాల్ చాలా వీక్ గా చేతులు షివర్ అవుతూ కనిపించారు.
చెన్నైలో ఆదివారం జరిగిన 'మదగజ రాజ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశాల్ హాజరయ్యారు. అప్పుడు విశాల్ బాగా సన్నగా కనిపించారు. అలాగే ఈవెంట్‌కు తన అసిస్టెంట్ సాయంతో వచ్చారు. మైక్ లో మాట్లాడుతూ విశాల్ చేతులు షివర్ అవ్వడం అభిమానులను చాలా టెన్షన్ పడుతుంది.
విశాల్ కు తీవ్ర జ్వరం ఉందని అందుకే ఇలా చేతులు కాళ్లు షివర్ అవుతున్నాయని చెబుతున్నారు విశాల్ టీం. కాని విశాల్ పరిస్థితి అలా లేదని ..విశాల్‌ను ఇలా చూడడం బాధగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్లో పాల్గొనడం చాలా గొప్ప విషయమని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం 'మదగజ రాజ'. ఈ సినిమా 12ఏళ్ల కిందటే ప్రారంభమై 2013లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్నో విషయాల్లో వాయిదాలు పడి2025 సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా జానర్ లో ఈ చిత్రం రూపొందింది. అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంతానం కీలక పాత్రలు పోషించారు. విజయ్ అంటోనీ సంగీతం అందించారు.
Devastated to see u like this @VishalKOfficial na - may lord Murugan give u all the strength to get your physical and mental strength back ! pic.twitter.com/StFjdL8SsX — Prashanth Rangaswamy (@itisprashanth) January 5, 2025