కీరవాణి కొడుకు జైసింహా కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నిన్న రాత్రి గోల్కొండ రిసార్ట్స్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను అంగరంగ వైభవంగా జరిపించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, ఆస్కార్ విన్నర్ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. మురళీమోహన్ మనవరాలిని కీరవాణి కొడుకు జైసింహా కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నిన్న రాత్రి గోల్కొండ రిసార్ట్స్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను అంగరంగ వైభవంగా జరిపించారు.
ఈ వేడుకకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినీ నటుడు మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి, నరేశ్, దగ్గుబాటి కుటుంబంతో పాటు తెలుగు ఇండస్ట్రీ అంతా తరలివచ్చారు.మురళీమోహన్ కుమారుడు రామ్ మోహన్ కు ఏకైక కుమార్తె రాగ. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం మురళీమోహన్ కుటుంబానికి చెందిన వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
కీరవాణి కుమారుడు సింహా తొలుత దర్శకత్వ విభాగంలో పని చేసి... ఆ తర్వాత నటుడిగా మారారు. తెల్లవారితే గురువారం, మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్, మత్తు వదలరా2 చిత్రాల్లో హీరోగా నటించారు.ప్రస్తుతానికి బిజీ ఆర్టిస్ట్ ...ఇరు కుటుంబాల మధ్య సింపుల్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకున్నారు .