London Doctor: లండన్ లో వెటర్నటీ ఆత్మహత్య..ఇక పై హత్యలు చెయ్యలేనంటూ లేఖ!

పెంపుడు జంతువుల పట్ల జరుగుతున్న అన్యాయానికి తన మనసు విరిగిపోయిందంటు లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటుంది.


Published Nov 20, 2024 12:30:00 PM
postImages/2024-11-20/1732086096_Vetsuicide.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; లండన్ లో ని వించెస్టర్ లో జాన్ ఎల్లిన్ వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. తన ప్రొఫిషినల్ లైఫ్ పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు వెటర్నటీ డాక్టర్ కు అంత ప్రెజర్ ఏముంటుంది అనుకుంటాం. కాని చుట్టు జరుగుతున్న పరిస్థితులను చూసి విరక్తి చెందారు. పెంపుడు జంతువుల పట్ల జరుగుతున్న అన్యాయానికి తన మనసు విరిగిపోయిందంటు లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటుంది.


లండన్ లోని వించెస్టర్ లో జాన్ ఎల్లిస్ వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. వయసు 35 ఏళ్లే అయినా తన వృత్తిలో బాగా పేరు సంపాదించుకున్నాడు. అయితే జంతువులను చెకప్ కు తీసుకువస్తారు. కాని వాటిని అత్యవసరంగా ఏమైనా అనారోగ్యం ఉంటే జంతువుల ఆరోగ్యం పై డబ్బు ఖర్చు చెయ్యరని ..చాలా జంతువలను తన చేతులారా ..చంపేశానని ఆ గిల్ట్ నేను భరించలేనని ...అందుకే ఇక బతకలేక చనిపోతున్నట్లు లేఖ రాశాడు.


 చాలా మంది డబ్బులున్న వారు....జంతువులపై అసలు ప్రేమ చూపించరని...వాటికి ఆరోగ్యసమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోరని...ఖర్చు పెట్టే కంటే ...తన చేతులతో చాలా జంతువులను చంపేయాల్సి వచ్చిందని డిప్రెషన్ కు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. నొప్పి తెలియకుండా జంతువుల ప్రాణంతీసే మందును తన శరీరంలోకి ఎక్కించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  సున్నితంగా తన మనసు దీన్ని తట్టుకోలేకోయిందని వాపోయాడు ఆయన తండ్రి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu doctors sucide viral-video

Related Articles