అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే ఎలా ఉంటుంది. ఏదో గదిలో ఉన్నట్లుగా లోపల ఉండి చూస్తేనే అధ్భుతంగా ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొన్ని సార్లు ఎత్తు మీద నుంచి కిందకి చూడడం చాలా అందంగా ఉంటుంది. కొండ మీద నుంచి చల్లని గాలి, ఎత్తైనా పర్వతాలు ..అసలు అక్కడ నుంచి చూస్తేనే భలే బాగుంటుంది. అసలు ఆ కొండలనే ఇంకా ఎత్తు నుంచి చూస్తే ఎలా ఉంటుంది. అలాంటి అధ్భుతమైన వీడియోను షేర్ చేసింది ఐఎస్ ఎస్ .
అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే ఎలా ఉంటుంది. ఏదో గదిలో ఉన్నట్లుగా లోపల ఉండి చూస్తేనే అధ్భుతంగా ఉంటుంది. అలాంటిది అంతరిక్షంలో తేలుతూ ...స్పేస్ వాక్ చేస్తూ కింద భూమిని చూస్తే కింద వందల కిలోమీటర్ల దిగువున ఉన్న భూమని చూస్తుంటే అధ్భుతం. అసలు అంత ఎత్తు నుంచి భూమ్మీద కొండలు..కోనలు...అడువులు...నదులు ఎంత అందంగా ఉంటాయో కదా.. మధ్యలో మేఘాలు కూడా ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియోలో తెలస్తుంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉన్న నాసా వ్యోమగామి ఒకరు ఇలాంటి దృశ్యాన్ని వీడియో తీశారు. ఐఎస్‌ఎస్ నుంచి బయటికి వచ్చి స్పేస్ వాక్ చేస్తున్న సమయంలో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతెత్తున భూమి తిరుగుతున్నట్టు చూడడమే చాలా అధ్బుతంగా ఉంది.
Amazing footage of Earth during a spacewalk on ISS pic.twitter.com/jZvimc37L5 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 18, 2024