keerthi suresh: మహానటి పెళ్లికి అన్ని సిధ్దం ..ఇంతకీ పెళ్లి ఎక్కడంటే !రా

రీసెంట్ గా టాలీవుడ లో 5 పెళ్లిళ్లు హాట్ టాపిక్ . అందులో కీర్తి సురేష్ పెళ్లి ఒకటి ...ఈ సారి కీర్తి పెళ్లి మాటలు నేషనల్ మీడియా కూడా మాట్లాడుతుం


Published Nov 20, 2024 01:50:00 PM
postImages/2024-11-20/1732090901_Keerthisuresh.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోను  హీరోయిన్లంతా పెళ్లి చేసుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ లో 5 పెళ్లిళ్లు హాట్ టాపిక్ . అందులో కీర్తి సురేష్ పెళ్లి ఒకటి ...ఈ సారి కీర్తి పెళ్లి మాటలు నేషనల్ మీడియా కూడా మాట్లాడుతుంది. కీర్తి అఫిషియల్ గా చెప్పలేదు కాని ...పెళ్లి పీటలు ఎక్కడం మాత్రం నిజమేనంటున్నాయి తమిళ మీడియా సంస్థలు.


అయితే ఈసారి కీర్తి పెళ్లి మాటలు వాస్తవమే. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందంట. పైగా వరుడు ఎవరో కాదు ఆమెకు 14 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి. అతని పేరు ఆంటోని తట్టిల్. వచ్చే నెలలో కేవలం అతి కొద్దీ మంది సన్నిహిత బంధువుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారట.  గోవాలో పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది. అయితే డిసెంబర్ 11,12 తేదీల్లో పెళ్లి జరుగుతుందట. ఇప్పటికే పెళ్లి పనులు అన్ని మొదలయ్యాయి.


 ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే కీర్తి పెళ్లి కబురు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అంతేకాదు..  కీర్తి ప్రేమ సక్సస్ అయ్యి పెళ్లి చేసుకుంటుందని తన ఫ్యాన్స్ చాలా మంది శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding goa keerthysuresh

Related Articles