కల్కి 2898 AD సినిమాతో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో మోగిపోతుంది.అయితే అలాంటి ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అర డజన్ సినిమాలు ఉన్నాయట. మరి ఇంతకీ ప్రభాస్ చేతిలో ఉన్న ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ కల్కి 2898 AD మూవీ తర్వాత మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత సీతారామం ఫేమ్ డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాని ఒప్పుకున్నారు.అలాగే సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమాని కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఇవే కాకుండా సలార్ సినిమాకి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్-2 కూడా రాబోతుంది.. అలాగే కల్కి 2898 AD మూవీ కి కూడా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు.ఈ సినిమాలే కాకుండా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చెప్పిన కథకి కూడా ప్రభాస్ ఓకే చెప్పినట్టు ఆ మధ్యకాలంలో అనౌన్స్మెంట్ వచ్చింది. ఇలా ప్రభాస్ ఏకంగా తన చేతిలో అరడజన్ సినిమాలను పెట్టుకున్నారు
న్యూస్ లైన్ డెస్క్: కల్కి 2898 AD సినిమాతో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో మోగిపోతుంది. ఇన్ని రోజులు టాలీవుడ్ ను చీదరించుకునే ఇతర ఇండస్ట్రీల జనాలు ప్రస్తుతం టాలీవుడ్ కు సలాం కొడుతున్నారు. దానికి కారణం మన తెలుగు దర్శకులే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు టాలీవుడ్లో నటించడానికి ఎంతోమంది ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలు ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD మూవీ పాన్ వరల్డ్ లెవల్ లో ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు.
అయితే అలాంటి ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అర డజన్ సినిమాలు ఉన్నాయట. మరి ఇంతకీ ప్రభాస్ చేతిలో ఉన్న ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ కల్కి 2898 AD మూవీ తర్వాత మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత సీతారామం ఫేమ్ డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాని ఒప్పుకున్నారు.అలాగే సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమాని కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఇవే కాకుండా సలార్ సినిమాకి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్-2 కూడా రాబోతుంది.
ఇక ఈ సినిమా దేవర సినిమా అయిపోవడంతోనే షూటింగ్ మొదలెట్టేస్తారట. అలాగే కల్కి 2898 AD మూవీ కి కూడా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు.అలాగే ఈ సినిమా ఇప్పటికే 60% పూర్తయిందని నిర్మాత అశ్వినీ దత్ చెప్పారు. ఈ సినిమాలే కాకుండా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చెప్పిన కథకి కూడా ప్రభాస్ ఓకే చెప్పినట్టు ఆ మధ్యకాలంలో అనౌన్స్మెంట్ వచ్చింది. ఇలా ప్రభాస్ ఏకంగా తన చేతిలో అరడజన్ సినిమాలను పెట్టుకున్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీ బిజీగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు