దుబాయ్ వెళ్తున్నారా ఇవి నిషేధం..తప్పక తెలుసుకోవాల్సిందే.?

సాధారణంగా విమాన ప్రయాణం చేయాలంటే అనేక  రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా విమానంలో కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. ఒక్కోసారి ఆ వస్తువులను


Published Aug 09, 2024 09:37:49 PM
postImages/2024-08-09/1723219669_flight.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా విమాన ప్రయాణం చేయాలంటే అనేక  రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా విమానంలో కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. ఒక్కోసారి ఆ వస్తువులను తీసుకెళ్లాలంటే అనుమతి కూడా ఇవ్వరు.  అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  కొబ్బరికాయ.  కొబ్బరికాయను విమాన ప్రయాణాల్లో ప్రయాణించే సమయంలో తీసుకెళ్లకూడదట.  దీనికి ప్రధాన కారణం కొబ్బరికాయలో ఉండేటువంటి  నూనె అని తెలుస్తోంది. ఈ నూనెను మండే వస్తువుగా వర్గీకరించడం వల్ల దీన్ని భద్రత ప్రమాణాల దృష్ట్యా విమాన ప్రయాణాల్లో నిషేధించబడింది.

ఇక ఈ వస్తువులే కాకుండా  హెరాయిన్, గంజాయి, కోకాయిన్ వంటి మాదకద్రవ్యాలు కూడా విమాన ప్రయాణాల్లో నిషేధించబడ్డాయట. ముఖ్యంగా దుబాయ్ వెళ్లే విమానాల్లో  అంగుళం అంగుళం చెక్ చేస్తారట. కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం  విమానాలు అనుమతించిన వస్తువులు మాత్రమే ప్యాక్ చేసేలా చూసుకోవాలట.

దుబాయ్ వెళుతున్న సమయంలో చేతి సామాను తనిఖీ చేసిన సామాను రెండింటిలో ఏ వస్తువులు అనుమతించబడతాయో  వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.  చాలామంది ఈ విషయం తెలియక వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా బిటల్ ఆకులు, దంతాలు, జూదం పరికరాలు గంజాయి, కోకైన్, వీటితో పాటుగా  పుస్తకాలు, కొన్ని రకాల వైద్య పరికరాలు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈ సిగరెట్లు కూడా దుబాయ్ తీసుకెళ్లడానికి నిషేధించబడ్డాయట. కాబట్టి దుబాయ్ వెళ్లే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line dubai flight coconut herain

Related Articles