BANK:బ్యాంకు లోన్ తీసుకొని కట్టలేకపోతున్నారా అయితే శుభవార్త.?

ప్రస్తుత కాలంలో చాలామంది  ఇల్లు లేదంటే, వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఏదో ఒక రకంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లోను  ఈఎంఐల రూపంలో వివిధ వాయిదాలలో  బ్యాంకు వారికి


Published Sep 29, 2024 06:39:02 PM
postImages/2024-09-29/1727615342_LOAN.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది  ఇల్లు లేదంటే, వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఏదో ఒక రకంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లోను  ఈఎంఐల రూపంలో వివిధ వాయిదాలలో  బ్యాంకు వారికి చెల్లిస్తారు. ప్రస్తుతం ఇలా అప్పు ఇచ్చే వాటిలో బ్యాంకులే కాకుండా, థర్డ్ పార్టీ అప్స్ కూడా వస్తున్నాయి. ఇందులో కొన్ని యాప్స్ తక్కువ ఇంట్రెస్ట్ వేసిన మరికొన్ని యాప్స్ వారు ఎక్కువ ఇంట్రెస్ట్ తో తీసుకున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏది ఏమైనా  బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ కట్టకపోతే  తప్పనిసరిగా బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి నానా హంగామా చేస్తారు.

లేదంటే మన ఆస్తులను జప్త్ చేస్తారని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అలా భయపడకుండా ఈఏంఐ తీసుకున్నా కానీ  కట్టలేని పరిస్థితి వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. అయితే మనం ఇన్స్టాల్మెంట్లు మూడు వరుసగా కట్టడం ఆపేస్తే సమస్య తలెత్తుతుంది. సదరు బ్యాంకు మనల్ని రుణం ఎగ్గొట్టిన వారీగా పరిగణిస్తుంది. ఈ టైంలో బ్యాంకు వారు నోటీసులు పంపి సిబిల్ స్కోర్ కూడా తగ్గిస్తారు. దీనివల్ల కొత్త రుణాలు ఇక ఎవ్వరు కూడా ఇవ్వరు.

ముఖ్యంగా ఇన్స్టాల్మెంట్లు కట్టడంలో మీకు  ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగా మీరు వెళ్లి బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. మీకు ఉన్నటువంటి పరిస్థితులను బ్యాంక్ అధికారులకు వివరించాలి. వారి నుంచి కొంత సమయం అడిగి ఆ తర్వాత డబ్బులను అరేంజ్ చేసుకోవాలి. అప్పటికి మీకు డబ్బు అందకపోతే బ్యాంక్ అధికారుల సాయంతోనే ఏ ఇంటి మీద లేదంటే స్థలం మీద లోన్ తీసుకుంటారో దాన్ని బ్యాంక్ అధికారుల చేతనే  అమ్మకానికి పెట్టాలి. దీని ద్వారా కాస్త ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు.

అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంక్ అధికారులను రిక్వెస్ట్ చేసుకొని లోన్ డబ్బులు అరేంజ్మెంట్ అయ్యేవరకు వారు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని విషయాన్ని వారికి తెలియజేయాలి.  దీనివల్ల కూడా మీరు  బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాస్త సమయం ఇస్తుంది. మరి ముఖ్యంగా  ఈఎంఐ ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి మనం అత్యవసర పరిస్థితులకు సంబంధించి కొంత నిధిని ఎప్పుడైనా సేవ్ చేసుకొని ఉండాలి. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఈఎంఐ చెల్లించవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu emi bank-loan home-loan bank-rulls

Related Articles