రతీయుడు2 జూలై 12వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. విడుదలైన మొదటి షో అయిపోగానే కాస్త ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మొదటి రోజు దూసుకెళ్లింది అని చెప్పవచ్చు. అలాంటి ఈ మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్స్ సాధించింది ఆ వివరాలు ఏంటో చూద్దాం.శంకర్ దర్శకత్వంలో తెరకేక్కిన మూవీ భారతీయుడు 2. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. కథ పరంగా అద్భుతమైన సినిమా అయినా కానీ దీన్ని తెరకెక్కించడంలో కాస్త తడబడ్డాడని చెప్పవచ్చు. సినిమా చూస్తుంటే విపరీతమైన బోరింగ్ ఫీల్ కలుగుతుంది. సీన్స్ అన్ని ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఫ్లాప్ టాక్ తో కూడా భారతీయుడు2 మొదటిరోజు రూ:25.6 కోట్ల కలెక్షన్స్ సాధించిందట. ఇందులో తెలుగులో రూ:7.9 కోట్లు, తమిళంలో రూ:16.5 కోట్లు, హిందీలో రూ:1.2 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకేక్కిన మూవీ భారతీయుడు 2. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. కథ పరంగా అద్భుతమైన సినిమా అయినా కానీ దీన్ని తెరకెక్కించడంలో కాస్త తడబడ్డాడని చెప్పవచ్చు. సినిమా చూస్తుంటే విపరీతమైన బోరింగ్ ఫీల్ కలుగుతుంది
న్యూస్ లైన్ డెస్క్: భారతీయుడు2 జూలై 12వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. విడుదలైన మొదటి షో అయిపోగానే కాస్త ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మొదటి రోజు దూసుకెళ్లింది అని చెప్పవచ్చు. అలాంటి ఈ మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్స్ సాధించింది ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కిన మూవీ భారతీయుడు 2. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. అలాంటి ఈ చిత్రం కోసం కమలహాసన్ మరియు శంకర్ 28 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మన ముందుకు వచ్చింది.
భారతీయుడు 1 సినిమాలో ప్రభుత్వ ఆఫీసుల్లో ఏవిధంగా లంచాలు తీసుకోవడంపై పోరాటం చేసే ఒక స్వాతంత్ర సమరయోధుడిలా కమలహాసన్ నటిస్తారు. ఈ చిత్రం అప్పట్లోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా భారతీయుడు2 వచ్చింది. ఇందులో కూడా కరప్షన్ పై అద్భుతంగా కొట్లాడే వ్యక్తిగా కమలహాసన్ నటించారు. కథ పరంగా అద్భుతమైన సినిమా అయినా కానీ దీన్ని తెరకెక్కించడంలో కాస్త తడబడ్డాడని చెప్పవచ్చు. సినిమా చూస్తుంటే విపరీతమైన బోరింగ్ ఫీల్ కలుగుతుంది.
సీన్స్ అన్ని ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఈ విధంగా ఫ్లాప్ టాక్ తో కూడా భారతీయుడు2 మొదటిరోజు రూ:25.6 కోట్ల కలెక్షన్స్ సాధించిందట. ఇందులో తెలుగులో రూ:7.9 కోట్లు, తమిళంలో రూ:16.5 కోట్లు, హిందీలో రూ:1.2 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పోటీగా ప్రస్తుతం ప్రతి థియేటర్ లో కల్కి 2898 Ad మూవీ ఉంది. రెండు సినిమాల మధ్య విపరీతమైనటువంటి పోటి ఏర్పడింది.
అయినా భారతీయుడు2 కలెక్షన్స్ పరంగా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇందులో కమలహాసన్ సేనాపతి పాత్రలో అద్భుతంగా నటించారు. దేశవ్యాప్తంగా కమలహాసన్ ను అభిమానులు ఇండియన్ తాతా అని పిలుస్తారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా అద్భుతంగా నటించాడని చెప్పవచ్చు. అంతేకాకుండా హీరో సిద్ధార్థ, ఎస్ జె సూర్య, గుల్షన్ గ్రోవర్, బాబీ సింహ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.