1996 సమయంలో భారతీయుడు మూవీ దేశంలోనే సంచలనం సృష్టించింది. ఆ టైంలో ఈ చిత్రాన్ని చూడడానికి వచ్చే వారితో కొన్ని నెలల పాటు థియేటర్లు నిండిపోయాయట. అవినీతిపై ఒక స్వాతంత్ర సమరయోధుడు ప్రశ్నించినటువంటి కథను బేస్ చేసుకుని చాలా అద్భుతంగా తెరకేక్కించారు డైరెక్టర్ శంకర్. అలాంటి ఈ చిత్రాన్ని దాదాపు 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు సీక్వెల్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి కూడా శంకర్ డైరెక్షన్ చేశారు. అలాంటి ఈ మూవీ ఏ విధంగా ఉంది. ప్లస్లు, మైనస్లు ఏంటి అనే వివరాలు చూద్దాం..
న్యూస్ లైన్ డెస్క్: 1996 సమయంలో భారతీయుడు మూవీ దేశంలోనే సంచలనం సృష్టించింది. ఆ టైంలో ఈ చిత్రాన్ని చూడడానికి వచ్చే వారితో కొన్ని నెలల పాటు థియేటర్లు నిండిపోయాయట. అవినీతిపై ఒక స్వాతంత్ర సమరయోధుడు ప్రశ్నించినటువంటి కథను బేస్ చేసుకుని చాలా అద్భుతంగా తెరకేక్కించారు డైరెక్టర్ శంకర్. అలాంటి ఈ చిత్రాన్ని దాదాపు 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు సీక్వెల్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి కూడా శంకర్ డైరెక్షన్ చేశారు. అలాంటి ఈ మూవీ ఏ విధంగా ఉంది. ప్లస్లు, మైనస్లు ఏంటి అనే వివరాలు చూద్దాం..
కథ:
భారతీయుడు సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదైనా పని చేయాలంటే లంచంగా డబ్బులు చేతిలో పెడితేనే పని అయ్యేది. ప్రస్తుతం కాలం మారింది టెక్నాలజీ పెరిగింది కానీ లంచం తీసుకోవడం మాత్రం ఆగలేదు. కానీ భారతీయుడులో డబ్బులు ఇవ్వడం చూపించారు. కానీ ఇందులో టెక్నాలజీతో లంచాన్ని ఏవిధంగా తీసుకుంటున్నారు అనే పాయింట్ తో కథ మొదలవుతుంది. ఇందులో లంచం లంచం అంటూ దాన్ని ప్రశ్నిస్తూ హీరో సిద్ధార్థ కనిపిస్తాడు. అయితే దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన సేనాపతి 100 సంవత్సరాల వయసు ఉన్నా కానీ అవినీతిపరులను ఏ విధంగా ఎదిరించాడు అతనికి అండగా ఎలా నిలిచాడు అనేదే పూర్తి కథ.
సినిమా విషయానికి వస్తే :
సినిమా స్టార్ట్ అయిన తర్వాత మొదటి 20 నుంచి 30 నిమిషాల పాటు కాస్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత పూర్తిగా బోర్ కొట్టడం మొదలవుతుంది. కథలో కొత్తదనం ఏమీ ఉండదు. కనీసం సెట్స్ లో అయినా కొత్తదనం కనిపిస్తుందా అంటే అది కూడా లేదు. కానీ భారతీయుడు సినిమాలో మాత్రం ఎమోషనల్ సీన్స్ మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అందులో సేనాపతి కూతురు చావు, ఆమెను బ్రతికించుకోవడం కోసం ఆయన పడే ఇబ్బందులు అందరినీ కన్నీరు పెట్టిస్తాయి. కానీ భారతీయుడు 2 లో ఇవేవీ కనిపించలేదు. ఇదే పెద్ద మైనస్ గా చెప్పవచ్చు.
నటీనటుల పనితీరు:
ఇందులో కమల్ హాసన్ గెటప్ చాలా వింతగా అనిపిస్తుంది. మేకప్ వేసినట్టు ఈజీగా తెలుస్తుంది. అంతేకాకుండా, పాటలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య వారి వారి పాత్రల్లో నటించేశారు. ఇక బిజిఎం విషయానికి వస్తే మరీ స్లో అయిపోయిందని చెప్పవచ్చు. ఏదో స్పీడ్‌గా సినిమాని శంకర్ పూర్తి చేసినట్టుగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
ఇందులో కమలహాసన్ నటనే ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్. అందరినీ ఆకట్టుకున్నారు. సెకండ్ హాఫ్ కాస్త పర్లేదనిపిస్తోంది.
మైనస్ పాయింట్స్:
భారతీయుడు సినిమా అదివరకు అందరూ చూసే ఉంటారు. దానికి సీక్వెల్‌గా వచ్చినటువంటి భారతీయుడు 2కథలో కొత్తదనం అనిపించలేదు. ఇంత టెక్నాలజీ ఉన్న కనీసం స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చూపించలేదు. మొత్తానికి డైరెక్షన్‌లో శంకర్ కాస్త వెనుకబడిపోయారని చెప్పవచ్చు.
రేటింగ్ :2/5.