Indian2:భారతీయుడు2 ట్రైలర్..ఆ ఒక్క సీన్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.? 2024-06-25 19:31:26

న్యూస్ లైన్ డెస్క్: ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ అంటే తెలియని వారు ఉండరు.  డైరెక్షన్ లో అద్భుతాలు సృష్టించే శంకర్ సినిమాల్లో ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. అలాంటి శంకర్ దర్శకత్వంలో  వస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం భారతీయుడు2. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాంటి ఈ మూవీలో  లోక నాయకుడు అయినటువంటి కమలహాసన్ హీరోగా చేస్తున్నారు. భారతీయుడు చిత్రం 1996లో వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది.

https://youtu.be/3bvBUT5pQYY?si=31oXcXP8u_HIZ00d

ఈ తరుణంలో  భారతీయుడు 2 చిత్రం కూడా రాబోతుండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా,  రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ, ఎస్ జె సూర్య,  సిద్ధార్థ్ ఇలా ఎంతో మంది స్టార్ నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయినటువంటి లైకా ప్రొడక్షన్ రెడ్ జైంట్ మూవీస్  కలిసి ఈ మూవీని  నిర్మిస్తున్నాయి.  భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ జూలై 12వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది.  విడుదల సమయం దగ్గరికి వస్తున్న కొద్ది చిత్ర యూనిట్ ప్రమోషన్  కార్యక్రమాలు చేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా ఈ మూవీ ట్రైలర్  విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో కమలహాసన్ పాత్ర మాత్రం హైలెట్ గా కనిపిస్తోంది.  ఈయన స్వాతంత్ర సమరయోధులైనటువంటి వీర శేఖరన్ సేనాపతి పాత్రలో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ లో కమలహాసన్ నటన చూస్తే గూస్ బంప్స్ పుట్టాల్సిందే.