ఇప్పటి వరకు ప్రభుత్వం రుణమాఫీ కోసం విడుదల చేసిన నిధుల్లో కేవలం రూ.7500 కోట్లు మాత్రమే అందాయని భట్టి తెలిపారు. బ్యాంకులకు రుణమాఫీ కోసం రూ.18వేల కోట్లు ఇచ్చాం. కానీ ఈరోజు వరకు కేవలం రూ.7500 కోట్లు మాత్రమే రుణమాఫీ అయిందని బ్యాంకర్ల సమావేశంలో భట్టి అసలు లెక్కలు చెప్పారు.
న్యూస్ లైన్ డెస్క్ : రైతులందరికీ పంటరుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం మాట తప్పిన విషయం తెలిసిందే. రూ.31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ విడుదలచేసింది మాత్రం రూ.18వేల కోట్లు మాత్రమే. మరి మిగతా 13 వేలకోట్లు ఏమయ్యాయని ఇటు రైతులోకం, విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు 100 శాతం రుణమాఫీ చేసేశామని ప్రభుత్వం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది.
Govt released ₹18000 Cr to banks for crop loan waiver but only ₹7500cr has been received by farmers - Dy CM Bhatti Vikramarka pic.twitter.com/lQv0xJmwAj — Naveena (@TheNaveena) August 20, 2024
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన నిజాలు బయటపెట్టారు. బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన రుణమాఫీ విషయంలో అసలు లెక్కలు మాట్లాడక తప్పలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం రుణమాఫీ కోసం విడుదల చేసిన నిధుల్లో కేవలం రూ.7500 కోట్లు మాత్రమే అందాయని భట్టి తెలిపారు. బ్యాంకులకు రుణమాఫీ కోసం రూ.18వేల కోట్లు ఇచ్చాం. కానీ ఈరోజు వరకు కేవలం రూ.7500 కోట్లు మాత్రమే రుణమాఫీ అయిందని బ్యాంకర్ల సమావేశంలో భట్టి అసలు లెక్కలు చెప్పారు. అయితే ఇదే రోజు ఓ కార్యక్రమంలో రైతులకు రూ.31 వేల రుణమాఫీ చేశామని చెప్పిన భట్టి.. ఇదేరోజు సాయంత్రం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో రైతులకు అందింది రూ.7500 కోట్లు మాత్రమే అని నిజమైన లెక్కలు చెప్పారు.