Big boss8:అమృత ప్రణయ్ తో పాటు ఉప్పల్** కూడా వస్తున్నారా.?

బిగ్ బాస్ రియాలిటీ షో  ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తిచేసుకుని 8వ సీజన్ కూడా ప్రారంభానికి సిద్ధమైంది. అలాంటి బిగ్ బాస్ ఇప్పటికే గత నాలుగు సీజన్ల నుంచి హోస్టుగా చేస్తున్న నాగార్జున ఈ ఎనిమిదవ సీజన్ లో కూడా రాబోతున్నారని తెలుస్తోంది.


Published Jul 28, 2024 12:17:12 AM
postImages/2024-07-28/1722143819_pranai12.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ రియాలిటీ షో  ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తిచేసుకుని 8వ సీజన్ కూడా ప్రారంభానికి సిద్ధమైంది. అలాంటి బిగ్ బాస్ ఇప్పటికే గత నాలుగు సీజన్ల నుంచి హోస్టుగా చేస్తున్న నాగార్జున ఈ ఎనిమిదవ సీజన్ లో కూడా రాబోతున్నారని తెలుస్తోంది. ఏడవ సీజన్ లో అంతా ఉల్టా పల్టాగా కొనసాగిన బిగ్ బాస్  కంటెస్టెంట్లుగా అన్ని రంగాల నుంచి వచ్చారు. చివరికి కామన్ మ్యాన్ గా వచ్చినటువంటి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచారు.

అలా సీజన్ 8 లో కూడా చాలామంది కంటెస్టెంట్లు వస్తున్నారని పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వేణు స్వామి, హీరో రాజు తరుణ్,  బర్రెలక్క, కుమారి ఆంటీ జబర్దస్త్ నుంచి కమెడియన్స్ వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో అమృత ప్రణయ్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతోందని సమాచారం అందుతుంది. ఇలా సాగుతున్న తరుణంలో మరో వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  ఈసారి బిగ్ బాస్ 8 లోకి ఉప్పల్ బాలుని కూడా తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా అన్ని రంగాల నుంచి కంటెస్టెంట్లను బిగ్ బాస్ యాజమాన్యం ఓకే చేసినట్టుగా సమాచారం. ఇందులో ఉప్పల్ బాలు పేరు కూడా బయటకు వస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఉప్పల బాలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉండబోతుందని, ఊహించుకొని నవ్వుతున్నారు.

ఉప్పల్ బాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు.  తన మాటలు, శరీర ఆకృతితో చాలామంది ప్రజల మన్ననలు పొందారు. అలాంటి ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే దానిమీద చాలామంది ఆలోచన చేస్తున్నారు.  అంతే కాదు ఈసారి బిగ్ బాస్ షో చాలా టర్మ్ అండ్ కండిషన్స్ తో ఉంటుందని తెలుస్తోంది. మరి చూడాలి ఈ షో ప్రారంభమయ్యే వరకు ఎవరు ఫైనల్ అవుతారనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna kumari-aunty big-boos8 amrutha-pranai uppal-bhalu

Related Articles